Kalyani Priyadarshan Lokah 300.. ఒకసారి కాదు, రెండు సార్లు కాదు.. పదే పదే ‘రిజెక్టెడ్ హీరోయిన్’ అనే ముద్ర, ఆమె మీద బలవంతంగా వేసేశారు.. ట్రేడ్ పండితులు.!
తెలుగులో ఆమెకి తొలి సినిమా ‘హలో’.‘ అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ సరసన ‘హలో’ సినిమాలో నటించిందామె.
తల్లి, తండ్రి.. ఇద్దరూ సినీ నేపథ్యం వున్నవారే. అలాగని, అదే అర్హతగా కళ్యాణి ప్రియదర్శన్ సినీ రంగంలోకి వచ్చెయ్యలేదు.!

నటనలో ఓనమాలు నేర్చుకోవడానికి ముందే, సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా అవగాహన పెంచుకుంది కళ్యాణి ప్రియదర్శన్.
అంటే, దర్శకత్వం, సినిమా నిర్మాణం.. ఇతరత్రా సాంకేతిక విభాగాలు.. ఇలా అన్నిటిలోనూ అవగాహన తెచ్చుకుంది కళ్యాణి ప్రియదర్శన్, నటి కాక ముందే.!
Kalyani Priyadarshan Lokah 300.. ఫెయిల్యూర్స్ నుంచి సంచలన విజయం దాకా..
కానీ, నటిగా ఆమెకు బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. తెలుగులో ఆమె ‘హలో’తోపాటు, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ తదితర సినిమాల్లో నటించింది కళ్యాణి ప్రియదర్శన్.
వీటిల్లో ‘చిత్రలహరి’ ఫర్వాలేదనిపించుకుంది. నటిగా కళ్యాణి ప్రియదర్శన్‌కి వంక పెట్టలేం. కాకపోతే, లక్కు కలిసి రాలేదంతే.!
అయితే, ఆమె టాలెంట్‌కి తగ్గ హిట్టు ‘లోక’ సినిమాతో దక్కింది. తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో విడుదలైంది ఈ సినిమా.!

విడుదలవుతూనే, ‘లోక’ సినిమాపై బోల్డంత నెగెటివిటీ. అయినాగానీ, ‘లోక’ సినిమా వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. 50 కోట్లు, వంద కోట్లు, నూట యాభై కోట్లు.. నంబర్స్ పెరుగుతూనే వచ్చాయ్.
తాజాగా, ‘లోక’ సినిమా 300 కోట్ల మార్క్ చేరుకుంది. మలయాళ సినీ పరిశ్రమకు సంబంధించి ఇదో పెద్ద రికార్డు.! అగ్ర హీరోలకు సైతం, సాధ్యం కాని రికార్డ్ ఇది.
Also Read: జై చిరంజీవ.! నీ నామ జపమే వాళ్ళకి బతుకుదెరువు.!
మొత్తం క్రెడిట్ అంతా, కళ్యాణి ప్రియదర్శన్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. సూపర్ స్టార్ ఆఫ్ సౌత్ సినిమా.. అంటోంది మలయాళ సినీ పరిశ్రమ కళ్యాణి ప్రియదర్శన్ గురించి.
నిజమే, ఓ నటి 300 కోట్ల క్లబ్‌లో చేరడం, సౌత్ సినిమా నుంచి ఇదే తొలిసారి. లేడీ సూపర్ స్టార్ అనగానే, సౌత్ సినీ పరిశ్రమలో నయనతార, త్రిష, అనుష్క.. తదితరుల పేర్లు చెప్తాం.

కానీ, ఇప్పుడు లెక్కలు మారాయ్. లేడీ సూపర్ స్టార్ అంటే కళ్యాణి ప్రియదర్శన్ ఇప్పుడు.! ఇకప్పటి రిజెక్టెడ్ హీరోయిన్ రేంజ్ ఇది.!
‘లోక’ సినిమాకి సీక్వెల్స్ రానున్నాయ్.! త్వరలోనే, వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.
