Kalyanram Amigos Ashika Ranganath నందమూరి బాలకృష్ణ నటించిన చాలా సినిమాల్లో చాలా హిట్టు పాటలున్నాయి. అందులో ఒకటి ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’. ‘ధర్మక్షేత్రం’ సినిమాలోనిది ఈ పాట.
తాజాగా ఈ పాటని నందమూరి కళ్యాణ్ రామ్ తన కొత్త సినిమా ‘అమిగోస్’ కోసం రీమిక్స్ చేశాడు. సినిమా రిలీజ్‌కి ముందే ఈ పాటని పూర్తిగా విడుదల చేసేశారు.
ఒకేలా వుండే ముగ్గురు వ్యక్తులు.. అంటే, రూపం పరంగా ఒకేలా వుంటారు. ఇంకా సరిగ్గా చెప్పాలంటే, త్రిపాత్రాభినయం అనుకోవచ్చు.
దీనికి ‘డూపుల్‌గాంగర్స్’ అంటూ సరికొత్త పేరు పెట్టి, ‘అమిగోస్’ సినిమాని జనం ముందుకు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.
Kalyanram Amigos Ashika Ranganath.. ఎన్నో రాత్రులొస్తాయిగానీ.. ఎలా వుందంటే..
నందమూరి కళ్యాణ్ రామ్ సరసన ఆషిక రంగనాథ్ ఈ ‘అమిగోస్’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఎన్నో రాత్రులొస్తాయిగానీ..’ ఫుల్ పాటని విడుదల చేసేశారు.. కానీ, ‘అంత లేదు’ అనే అంటున్నారంతా.
Also Read: They Call Him OG: కానీ, ఎందుకు.? ‘పవర్’ క్వశ్చన్.!
బాబాయ్ బాలయ్య పాటని చెడగొట్టావ్.. అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ మీద సెటైర్లేస్తున్నారు నెటిజన్లు. అలా విమర్శిస్తున్నవారిలో బాలయ్య అభిమానులే ఎక్కువగా వున్నారు.
కళ్యాణ్ రామ్ కావొచ్చు.. ఆషిక రంగనాథ్ కావొచ్చు.. ఇద్దరూ డాన్సుల్లో పరమ వీక్‌గా కనిపించారు. ఆనాటి ఆ క్లాసిక్ సాంగ్‌తో పోల్చితే, ‘అమిగోస్’లోని ‘ఎన్నో రాత్రులొస్తాయి గానీ..’ పాట తేలిపోయిందనే చెప్పాలి.