Kalyanram Amigos FDFS.. నందమూరి కళ్యాణ్ రామ్ తాజా సినిమా ‘అమిగోస్’ ప్రేక్షకుల ముందుకొచ్చంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే.
రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ హీరోయిన్‌గా నటించింది. నందమూరి కళ్యాణ్ రామ్ ‘ట్రిపుల్ రోల్’ ఈ సినిమా ప్రత్యేకతల్లో ఒకటి.
ఒకేలా వుండే ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ఇదొక థ్రిల్లర్. మూడు పాత్రల్లో ఒకటి నెగెటివ్ రోల్.!
‘బింబిసార’లో ఓ పాత్రలో నెగెటివ్ షేడ్స్ చూపించిన కళ్యాణ్‌రామ్ అంతకు ముందే, చాన్నాళ్ళ క్రితం ‘హరేరామ్’ సినిమాలోనూ నెగెటివ్ షేడ్స్ చూపించాడు.
మరి, కొత్తగా ‘అమిగోస్’లో కళ్యాణ్ రామ్ ఏం చూపించినట్టు.? ఇదే ఆసక్తి.. సినిమాపై హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది.
Kalyanram Amigos FDFS ఫస్ట్ టాక్ ఏంటంటే..
కథ, కథనాలేంటి.? అన్నది తర్వాత పూర్తి రివ్యూలో తెలుసుకుందాం. ప్రస్తుతానికైతే.. ఫస్ట్ టాక్‌తో సరిపెట్టుకుందాం.
మూడు పాత్రల్లోనూ నటుడిగా కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) అద్భుతంగా చేశాడన్నది.. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నమాట. రీమిక్స్ సాంగ్ ‘ఎన్నో రాత్రులొస్తాయి..’కి థియేటర్లలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
కాన్సెప్ట్ మాత్రం ప్రేక్షకులకి థ్రిల్ కలిగించింది. కాకపోతే, థ్రిల్లర్ సినిమాలకి కథనం వేగంగా వుండాలి. అక్కడే దర్శకుడు కాస్త బోల్తా పడ్డాడనేది అంతటా వినిపిస్తోన్న వాదన.

ఫస్టాఫ్‌తో పోల్చితే సెకెండాఫ్ మరింత నెమ్మదిగా సాగిందంటున్నారు. క్లయిమాక్స్ అదిరిందనీ, కానీ.. ఆ థ్రిల్‌ని చివరి వరకూ దర్శకుడు మెయిన్‌టెయిన్ చేయలేకపోయాడనీ అంటున్నారు.
Also Read: ముగిసిన హైడ్రామా.! కైరా అద్వానీ పెళ్ళయిపోయిందోచ్.!
అన్నట్టు, ప్రమోషన్స్ బాగా జరిగినా.. ఎందుకో ‘అమిగోస్’ (Amigos) ఓపెనింగ్స్ విషయంలో కాస్త ‘డల్‌నెస్’ కనిపించింది. పాన్ ఇండియా సినిమా.. అనే బిల్డప్ తొలుత కనిపించినా.. ఆ తర్వాత ఆ హంగామా ఏమీ లేదు.
వాస్తవానికి ‘బింబిసార’ తర్వాత కళ్యాణ్ రామ్ నుంచి వస్తున్న సినిమా గనుక, ఇంకాస్త జోష్.. అటు ప్రమోషన్లలోనూ.. ఇటు అభిమానుల హంగామాలోనూ వుండి వుండాల్సింది.
పూర్తి రివ్యూ.. కాస్సేపట్లో.!