Table of Contents
Kamal Haasan Abhirami Thuglife.. కమల్ హాసన్ సినిమా అంటే, ‘లిప్ లాక్’ ఖచ్చితంగా వుండాల్సిందే.. అన్న బలమైన అభిప్రాయం గతంలో వుండేది.!
ఏం, ఏడు పదుల వయసులో అయినా సరే, ఆన్ స్క్రీన్ లిప్ లాక్‌లో తప్పేముంది.? అంటున్నారిప్పుడు, కమల్ హాసన్ అభిమానులు.
‘థగ్ లైఫ్’ పేరుతో కమల్ హాసన్ కొత్త సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కమల్ – నటి అభిరామి మధ్యన ఓ లిప్ లాక్ సీన్ వుంది.
Kamal Haasan Abhirami Thuglife.. లిప్పు.. లాకు.. సినిమాటిక్ ట్రిక్కు.!
శింబు, త్రిష ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం. ట్రైలర్ బాగా కట్ చేశారు, ప్రోమోస్ బాగా జనాల్లోకి వెళ్ళిపోయాయి.. ఇదంతా వేరే చర్చ.
సినిమాలో కమల్ – అభిరామి మధ్యన ఓ లిప్ లాక్ సీన్ వైరల్ అయిపోయింది.! కమల్ వయసు ఏడు పదులు.. అభిరామి వయసు నాలుగు పదులు.. ఇదేం ‘ముద్దు పైత్యం’.? అంటూ, గుస్సా షురూ అయ్యింది.
Also Read: చక్కని చుక్క.. లక్కు తోక తొక్కినాదిరో.!
ఈ మొత్తం వ్యవహఆరంపై, ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చింది అభిరామి. ప్రోమోస్ చూశాక, అందులో యాక్షన్ కంటెంట్ అంతా వదిలేసి, లిప్ లాక్ మీద పడ్డారేంటి.? అని అభిరామి ప్రశ్నించింది.
ఏం చేసినా, అది సినిమా కోసమే.. ఎందుకు చేశామో, సినిమా చూస్తే తెలుస్తుందని అభిరామి (Abhirami) చెప్పుకొచ్చింది.
లిప్ లాక్ అంటే.. ట్రిక్కు మాత్రమేనా.?
ఆన్ స్క్రీన్ లిప్‌లాక్‌కి వయసుతో పనేంటి.? అని అభిరామి ప్రశ్నించింది. అదీ నిజమే.! ఎందుకంటే, ఆన్ స్క్రీన్ లిప్ లాక్స్ చాలావరకు, ‘ట్రిక్స్’ అంతే.!
కొన్ని సినిమాటిక్ ట్రిక్స్ వాడి, ఆ లిప్ లాక్ సీన్స్ తెరకెక్కిస్తుంటారు. బెలూన్‌ని వినియోగించడం.. లాంటివన్నమాట.
ఇలాంటి బెలూన్ లిప్ లాక్స్ గురించి చాలామంది నటీనటులు చాలా సందర్భాల్లో చెప్పడం విన్నాం.. వెండితెరపై అలాంటివి చూశాం కూడా.!
నిజమైన లిప్ లాక్స్..
నిజంగానే, లిప్ లాక్ సీన్స్.. హీరోయిన్ల మధ్య జరిగితే..! ఎందుకు జరగలేదు, బాలీవుడ్‌లో ఇమ్రాన్ హష్మీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
కరిష్మా కపూర్ ఓ సినిమా కోసం సుదీర్ఘమైన లిప్ లాక్ సీన్ చేసింది.. అలా చేసినవాటికి, ఆ పబ్లిసిటీ వేరే లెవల్‌లో వుంటుందనుకోండి. అది మళ్ళీ వేరే చర్చ.
ఇంతకీ, కమల్ – అభిరామి మధ్య లిప్ లాక్ నిజమేనా.? నిజమో కాదో.. అసలంటూ, సినిమాలో ఎందుకు ఆ సీన్ పెట్టారో తెలియాలంటే, సినిమా చూడాలి.!