కమల్ హాసన్.. పరిచయం అక్కర్లేని పేరిది. భారతదేశం గర్వించదగ్గ నటుడాయన. తన ఆస్తిని 176 కోట్లుగా ప్రకటించాడు ఈ విశ్వనటుడు (Kamal Haasan Assets And Education). తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తన విద్యార్హత, ఆస్తిపాస్తుల వివరాల్ని ఎన్నికల అఫిడవిట్‌లో కమల్ హాసన్ వెల్లడించాల్సి వచ్చింది.
అందరికీ తెలిసిన విషయమే, కమల్ హాసన్ చాలా బాషల్లో నటించాడని. అంతే కాదు, ఆయనకు చాలా భాషలు మాట్లాడటం వచ్చు. మాతృభాష తమిళం సహా, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ.. ఇలా పలు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలగడం కమల్ హాసన్‌కే చెల్లింది. ఇంగ్లీషులోనూ ఆయన చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడతారు.
కమల్ హాసన్ చదివింది కేవలం 8వ తరగతి వరకు మాత్రమే. తన విద్యార్హతను స్పష్టంగా కమల్ హాసన్, ఎన్నికల అపిడవిట్‌లో ప్రస్తావించారు.
కాగా, కమల్ హాసన్, మక్కల్ నీది మయ్యం పార్టీని (Makkal Needhi Maiam) స్థాపించి, తమిళనాడు (Tamilnadu Politics) రాజకీయాల్లో హల్‌చల్ చేస్తున్నారు. ఆయనకు, ఆయన పార్టీకి ఇవే తొలి అసెంబ్లీ ఎన్నికలు.
మక్కల్ నీది మయ్యం పార్టీ, అధికారంలోకి వస్తుందా.? లేదా.? అన్నది వేరే చర్చ. కానీ, కమల్ హాసన్‌కి వున్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.. ఖచ్చితంగా ఆయన తమిళ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.
రాజకీయ పార్టీ పెట్టింది మొదలు, నిత్యం జనంలో వుండేందుకు కమల్ హాసన్ (Kamal Haasan Assets And Education) ప్రయత్నించారు. ఎన్నికల వేళ మరింతగా జనంలోకి వెళుతున్నారు.. అధికారంలోకి వస్తే మెరుగైన పాలన అందిస్తామంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే, అధికార అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకేలను కమల్ హాసన్ ఢీకొట్టడం అంత తేలిక కాదు.