Kangana Ranaut Chandramukhi2.. ‘చంద్రముఖి’ అంటే ‘లక లక లక..’ అంటూ ఓ వింతైన శబ్ధం.. పసుపు రంగు చీరలో.. చింపిరి జుట్టు.. కళ్ల నిండా కాటుకతో నిండిన ఓ భయంకరమైన రూపం గుర్తొస్తుంటుంది.
అవును మరి, ‘చంద్రముఖి’ (Chandramukhi) సినిమాలో హీరోయిన్‌గా నటించిన జ్యోతిక (Jyothika) పాత్రను అలాగే డిజైన్ చేశారు. ఈ క్యారెక్టర్‌పై వచ్చిన మీమ్స్, కామెడీ సీన్స్ అన్నీ ఇన్నీ కావు.
అదంతా అప్పటి చంద్రముఖి రూపం. కానీ, ఇప్పుడు నయా చంద్రముఖి వచ్చింది. అదేనండీ, రెండో చంద్రముఖి (‘చంద్రముఖి 2’)
Kangana Ranaut Chandramukhi2.. మంత్ర ముగ్ధుల్ని చేస్తోన్న నిండైన రూపం.!
చంద్రముఖి సినిమాలో సూపర్ స్టార్ రజనీ కాంత్ (Super Star Rajnikanth) మేల్ లీడ్ పోషించగా, ఈ రెండో చంద్రముఖిలో లారెన్స్ రాఘవ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
చంద్రముఖి పాత్రలో బాలీవుడ్ భామ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ (Kangana Ranaut) నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి కంగనా రనౌత్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్లు.

ఈ ఫస్ట్ లుక్‌లో కంగనా ఎంతో అందంగా సౌమ్యంగా నిండైన రూపంలో దర్శనమిస్తోంది. ఆ చంద్రముఖిని చూస్తే భయం వేసేది.
ఈ చంద్రముఖి రూపం చూపు తిప్పుకోనీయకుండా చేస్తోంది. మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. కంగనా రనౌత్ (Kangana Ranaut) ఏ పాత్ర పోషించినా అంతే, పరకాయ ప్రవేశం చేస్తుంది.
దటీజ్ కంగనా.!
రాణి రుద్రమదేవిగా ‘మణికర్ణిక’లో కనిపించినా, అమ్మ జయలలితగా ‘తలైవి’ (Thalaivi)లో మెరిసినా ఇప్పుడు ‘చంద్రముఖి’గా నయా అవతారమెత్తినా.. ఆమెలో ఏదో ప్రత్యేకత వుంటుంది. దటీజ్ కంగనా.!
Also Read: Faria Abdullah.. అందులో జాతిరత్నమే సుమీ.!
పి. వాసు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘చంద్రముఖి 2’ (Chandramukhi2) సినిమాని లైకా ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
కీరవాణి ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించబోతున్నారు. చూడాలి మరి, మొదటి ‘చంద్రముఖి’ సెన్సేషనల్ రికార్డుల్ని రెండో చంద్రముఖి బీట్ చేస్తుందో లేదో.!