Kangana Ranaut Emergency బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్, త్వరలో ‘ఎమర్జన్సీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ఆమే దర్శకురాలు, ఆమే నిర్మాత కూడా.
దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కంగనా రనౌత్ నటిస్తోంది. మొత్తంగా తన ఆస్తులన్నిటినీ తనఖా పెట్టేసి ఈ సినిమా పూర్తి చేసిందట కంగనా రనౌత్.
వామ్మో.! ఇది మరీ టూమచ్ కదా.! గత కొంతకాలంగా కంగనా రనౌత్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చవిచూస్తోంది.
Kangana Ranaut Emergency.. ఎమర్జన్సీ ఫ్లాపైతే.?
‘ఎమర్జన్సీ’ సినిమా గనుక ఫ్లాప్ అయితే, కంగనా రనౌత్ రోడ్డున పడటం ఖాయమేనట. ఈ విషయం కంగన పరోక్షంగా సెలవిచ్చింది.
కానీ, అసలు సంగతి వేరే వుంది. ఈ సినిమాకి తెరవెనుక బడా వ్యక్తులే ‘ఆర్థిక సాయం’ చేశారు. కానీ, పేరు మాత్రం కంగనా రనౌత్‌ది.

బీజేపీకి కంగనా రనౌత్ మద్దతిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ‘ఎమర్జనీ’ సినిమా రూపొందించింది కంగన.
కంగన సినీ రాజకీయం..
వచ్చే ఎన్నికల్లో కంగన రనౌత్ బీజేపీ నుంచి పోటీ చేయబోతోంది.. అదీ లోక్‌సభ నియోజకవర్గానికి. స్వరాష్ట్రం నుంచే ఆమె పోటీ చేయబోతోంది కూడా.
ఈ నేపథ్యంలో బీజేపీకి తనవంతుగా సాయం చేసేందుకోసం ‘ఎమర్జన్సీ’ సినిమాని కంగన తెరకెక్కింది. అంటే, సినిమాలో ఇందిర పాత్రలో కంగన విలనిజం చూపించబోతోందన్నమాట.
దేశంలో ఇందిర ఎమర్జన్సీపై చాలా విమర్శలున్నాయి. ఆనాటి పరిస్థితుల్ని కాంగ్రెస్ నేతలే ఖండిస్తుంటారు.
Also Read: Rashmika Mandanna: ప్చ్. ఇంకో ‘బి’ షాక్ తగిలింది.!
కానీ, ఇందిరా గాంధీ అంటే దేశ రాజకీయాల్లో ఐరన్ లేడీ. రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆమె ఘనతల్ని కీర్తించారు.
ఇకపై ఆ ఘనతలేవీ వుండవ్. ఎందుకంటే, కంగన పూర్తిస్థాయిలో ఇందిర ఇమేజ్‌ని ‘ఎమర్జన్సీ’ సినిమాతో డ్యామేజ్ చేసెయ్యనుంది.