Kangana Ranaut.. బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ అనగానే, ఆమె నటించిన సినిమాలు.. నటిగా ఆమె సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతుల కంటే, ‘పబ్లిసిటీ స్టంట్లు’ ఎక్కువగా గుర్తుకొస్తాయ్.
వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కంగనా రనౌత్‌కి వెన్నతో పెట్టిన విద్య. తోటి హీరోయిన్లను ఉద్దేశించి ‘బి-గ్రేడ్’, ‘సీ-గ్రేడ్’ అంటూ సర్టిఫికెట్లు కూడా జారీ చేస్తుంటుంది.
గత కొద్దికాలంగా బాలీవుడ్ జంట అలియా భట్ – రణ్‌బీర్ కపూర్ జంట మీద గుస్సా అవుతోంది కంగన. ఎందుకు.? అంటే, అది వేరే చర్చ.
Kangana Ranaut.. హృతిక్ రోషన్ గొడవ ఏమైంది.?
అప్పట్లో బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్‌తో తనకు ఎఫైర్ వుందనీ, పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడంటూ కంగన తీవ్ర ఆరోపణలు చేసింది.
హృతిక్ పెద్దగా కంగనకు కౌంటర్ ఎటాక్ ఇవ్వలేదు. అరిచి, గీపెట్టి.. చివరికి కంగన, హృతిక్ విషయాన్ని లైట్ తీసుకోవాల్సి వచ్చింది.

ఇప్పుడేమో తన మీద ఓ బాలీవుడ్ జంట నిఘా పెట్టిందంటూ సంచలన ఆరోపణలు చేసింది కంగనా రనౌత్. ఆ బాలీవుడ్ జంట ఎవరు.? అంటే, అలియా – రణ్‌బీర్.. అంటూ కంగన అభిమానులే లీక్ చేస్తున్నారు.
మతి లేదంతే.!
రణ్‌బీర్ – అలియా (Ranbir Kapoor Alia Bhatt) జంటకి కంగనతో పంచాయితీ ఏంటి.? అసలు వాళ్ళకు నిఘా పెట్టాల్సిన అవసరమేంటి.?
కంగన ఇంట్లో వున్నా.. బయటకు వెళ్ళినా.. నిఘా పెడుతున్నారట. ఇదెక్కడి పంచాయితీ.? అసలు ఇలా ఎక్కడైనా జరుగుతుందా.?
Also Read: తూచ్.! జాన్వీ కపూర్ ఒప్పుకోలేదుట.! అంతా ఫేక్.!
అందుకే మరి.. కంగన మతి గతి తప్పిందనేది.! ఎవరో నిఘా పెట్టారనే డౌట్ వుంటే, ఎంచక్కా పోలీసుల్ని ఆశ్రయించి, ఆధారాలు చూపించి తగిన భద్రత పొందొచ్చు.
అలా చేస్తే ఆమె కంగన ఎందుకవుతుంది.? వివాదాల్లేకపోతే నిద్ర పట్టదామెకి.! అందుకే, ఈ వివాదాలు.!
కెలుక్కోవడం.. మళ్ళీ ఎవరో ఏదో అన్నారంటూ ఏడవడం.. ఇది బాగా అలవాటైపోయింది కంగనా రనౌత్‌కి.! ఈ జాడ్యానికి మందు లేదు.!