Table of Contents
Kannappa Manchu Hard Disc మంచు విష్ణు తెరకెక్కిస్తున్న సినిమా ‘కన్నప్ప’.! త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.!
‘కన్నప్ప’ నుంచి 70 నిమిషాలకు సంబంధించిన వీడియో ఫుటేజ్, ఓ హార్డ్ డిస్క్ రూపంలో ‘తస్కరించబడింది’.!
తస్కరణ అంటే తెలుసు కదా, దొంగిలించడం.! దొంగిలించింది కూడా, నటుడు అలాగే నిర్మాత కూడా అయినా మంచు విష్ణుకి చెందిన కార్యాలయం నుంచి.
కొరియర్ ద్వారా వచ్చిన హార్డ్ డిస్క్ దొంగతనానికి గురైందంటూ మంచు విష్ణు ఆల్రెడీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు నిజాల్ని నిగ్గు తేల్చాల్సి వుంది.
Kannappa Manchu Hard Disc.. కుట్ర వెనుక మంచు మనోజ్.?
ఈలోగా, కార్యాలయ సిబ్బంది మీద అనుమానంతో మంచు విష్ణు ఫిర్యాదు చేసిన దరిమిలా, ఆ సిబ్బందే నిందితులని అనుకోవాల్సి వుంటుంది.
మరోపక్క, స్వయానా మంచు విష్ణు సోదరుడు మంచు మనోజ్, ఈ మొత్తం కుట్ర వెనకాల వున్నాడంటూ ఓ వాదన తెరపైకొచ్చింది. అదీ, మంచు విష్ణు అనుమానమే లెండి.!
గత కొన్నాళ్ళుగా అన్నదమ్ములిద్దరికీ మధ్య ఓ ‘పంచాయితీ’ నడుస్తోంది. ఆస్తుల పంపకాలు కాదంటాడు మనోజ్.. ఇంకోటేదో అంటాడు విష్ణు.
వినేవాడు వెర్రి వెంగళప్ప అయితే..
కొట్టుకునేదాకా వెళ్ళింది వ్యవహారం.! ఈ క్రమంలోనే జనరేటర్‌లో మంచు విష్ణు ‘పంచదార’ పోశాడంటూ, మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
ఈ చిలిపి గొడవల్లోనే, ‘కన్నప్ప’ సినిమా హార్డ్ డిస్క్ మిస్సింగు.! భలే వుంది కదా, ఈ ‘మంచు డ్రామా’.!
సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖులున్నారుగానీ, తరచూ మోహన్‌బాబు ఇంట్లో దొంగతనాలకు సంబంధించిన వార్తలే బయటకు వస్తుంటాయ్. ఇదో చిత్రం.
మంచు మ్యాజిక్..
నిజానికి, ‘కన్నప్ప’ సినిమాలో ప్రభాస్ వున్నాడు, మోహన్‌లాల్ సహా, భారీ తారాగణం వుంది. హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేశారు.
వంద కోట్ల బడ్జెట్ అనుకుంటే, రెట్టింపు అయ్యిందని విష్ణు స్వయంగా చెబుతున్నాడాయె. అలాంటప్పుడు, హార్డ్ డిస్క్ విషయంలో ఇంత నిర్లక్ష్యమా.?
Also Read: సమీక్ష ‘ఓదెల-2’: ఓటీటీలో ఉచితమే అయినా, టైమ్ వేస్ట్!
ఏదో మ్యాజిక్ జరుగుతోంది. తండ్రి, ఇద్దరు కొడుకులు.. ఇదో ‘మంచు కొట్లాట’.! పోలీసులు, ఆ మధ్య ముగ్గురికీ క్లాస్ పీకారు. అయినా, అదే తంతు.!
ఇప్పుడేమో, ‘కన్నప్ప’ని ఎత్తుకుపోయారంటూ, హార్డ్ డిస్క్ డ్రామాకి తెరలేపాడు విష్ణు.! ఇదే ‘మోహన్‌బాబు’ క్రమశిక్షణ అంటే.! నలుగురూ నవ్విపోదురుగాక.. వాళ్ళకేటి సిగ్గు.?