Table of Contents
Katrina Kaif సినిమాల్లో కొన్ని సీన్ల కోసం డూపుల్ని వాడడం సహజమే. యాక్షన్ సీన్లు, కొన్ని ఛేజింగ్ సీన్ల కోసం డూపుల్ని వాడుతుంటారు. అది అందరికీ తెలిసిన విషయమే.
అయితే, ఈ హీరోయిన్‌కీ ఓ డూపు వుంది. అదీ సినిమా కోసం కాదు, యాడ్స్ కోసం.
అదేంటీ.? యాడ్స్ కోసం కూడా డూపుల్ని వాడతారా.? ఇంతకీ ఎవరా హీరోయిన్.? ఏంటా కథ.? వివరాల్లోకి వెళితే..
Katrina Kaif.. ఆమె జూనియర్ ఈమె డూప్.!
బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్‌కి డూప్‌గా అప్పట్లో జరీన్ ఖాన్‌ని తీసుకొచ్చాడు సల్మాన్ ఖాన్. కత్రినాపై విపరీతమైన కోపంతో అచ్చు అలాగే వున్న జరీన్ ఖాన్‌ని తీసుకొచ్చి హీరోయిన్‌గా పరిచచయం చేశాడు ఖాన్ బాబా.
అయితే, జరీన్ జూనియర్ కత్రినా అనిపించుకుంది కానీ, ఆ స్థాయి స్టార్‌డమ్ అయితే దక్కించుకోలేకపోయింది.
ఆ సంగతి అటుంచితే, కత్రినా కైఫ్‌కి తాను డూప్‌గా నటించానంటూ మరో నటి తాజాగా వెలుగులోకి వచ్చింది.

ఆమె పేరు దివ్య అగర్వాల్. హిందీ ఓటీటీ బిగ్‌బాస్‌కి ఈ భామ విన్నర్ అట. సినిమాలతో పాటూ, కొన్ని కమర్షియల్ యాడ్స్‌లోనూ కత్రినా కైఫ్ నటించిన సంగతి తెలిసిందే.
కనింపించేదంతా కత్రినా కాదు సుమా.!
అలా ఓ సోప్ యాడ్‌లో కత్రినాకి డూప్‌గా తాను నటించానని దివ్య అగర్వాల్ చెబితే, తాజాగా ఆ విషయం బోధపడింది. యాడ్స్‌కి కూడా డూప్స్ వుంటారా.? అని.
Also Read: ఔను.! వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు.!
అవునులెండి, యాడ్స్‌లోనూ కొన్ని అభ్యంతరకర సీన్లు వుండొచ్చు. ఆయా సీన్లలో నటించేందుకు స్టార్ హీరోయిన్లు ఒప్పుకోకపోవచ్చు. అందులోనూ సోప్ యాడ్ అంటే, కాస్త ఓవర్ డోస్ స్కిన్ షో చేయాలి వుండొచ్చు.
తమన్నాకి డూప్ వుందోచ్.!
అలాంటి యాడ్ కోసమేదైనా దివ్య అగర్వాల్ నటించి వుండొచ్చు. సో, యాడ్స్‌లో పూర్తిగా కనిపించేది కత్రినా కైఫ్ కాదన్న మాట.
‘బాహుబలి’ సినిమాలో తమన్నా పాత్రకు డూప్‌గా బుల్లితెర బ్యూటీ భానుశ్రీ నటించిన సంగతి తెలిసిందే. కొన్ని యాక్షన్ సీన్లలో తమన్నాకి డూప్‌గా తాను నటించానని భానుశ్రీనే స్వయంగా చెప్పింది.