KCR BRSAndhra Pradesh గులాబీ పార్టీ రంగు మారలేదు.. కానీ, పార్టీ పేరు మారిపోయింది. తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా బీఆర్ఎస్ అయ్యింది.
జస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితిలోని తెలంగాణ ‘ఔట్’ అయిపోయి, ఆ ప్లేస్‌లోకి ‘భారత్’ అన్న పేరు వచ్చి చేరిందంతే.! మిగతాదంతా సేమ్ టు సేమ్ అనుకోవచ్చా.?
కానే కాదుట.! బీఆర్ఎస్ పుట్టడం వెనుక విశాల ప్రయోజనాలు, గొప్ప ఆలోచనలు వున్నాయని ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెబుతున్నారు.
KCR BRSAndhra Pradesh ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్..
తన పేరుకు దగ్గరగా వుందనుకున్నారో.. మీడియా పరంగా, ఆర్థికంగా, సామాజికంగా బలమైన వ్యక్తి అనుకున్నారోగానీ, తోట చంద్రశేఖర్‌ని తీసుకొచ్చి, ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడ్ని చేసేశారు కేసీయార్.!
అంతా బాగానే వుంది. ఆంధ్రోళ్ళని రాక్షసులుగా తెలంగాణ ఉద్యమంలో అభివర్ణించి, ఇప్పుడు అక్కడికెళ్ళి ఓట్లు ఎలా అడుగుతారట.? ఈ ప్రశ్న సహజంగానే తెరపైకొస్తోంది.
‘గదీ.. పాత ముచ్చట..’ అంటున్న గులాబీ నేతలు, తెలంగాణలో సెటిలైన ఆంధ్రోళ్ళని బాగానే చూసుకుంటున్నాం కదా.. అని చెబుతున్నారు.
ప్రత్యేక హోదా మాటేమిటి.?
ప్రత్యేక హోదా గురించి మాట్లాడాలి.. రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు వంటివాటి గురించీ మాట్లాడాలి. వీటితోపాటు, ఆంధ్రప్రదేశ్ రాజధానిపైనా బీఆర్ఎస్ విధానాన్నీ కేసీయార్ (Telangana CM KCR) బయటపెట్టాలి.
ఏమో, ముందు ముందు అన్ని విషయాలపైనా స్పష్టతనిస్తారేమో.! అప్పేడే ఎందుకు తొందర.! ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్, ఆంధ్రప్రదేశ్‌లో (Andhra Pradesh) రాజకీయం చేస్తే తప్పేంటట.?
పోన్లెండి.. కేసీయార్ వల్ల అయినా, ఏపీకి ప్రత్యేక హోదా వస్తే మంచిదే. రాష్ట్రానికి ఓ రాజధాని అనేది ఖరారైతే అంతకన్నా మంచిది. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే అంతకన్నా కావాల్సింది ఇంకేముంటుంది.?
Also Read: యెడ్డి యెంకటి ‘నీలి’ క్షుద్ర పాత్రికేయం.!
ఇవన్నీ సాధిస్తే, తెలంగాణ జాతి పిత.. అనిపించుకున్నట్లే.. ఆంధ్రప్రదేశ్ జాతి పిత.. అని కూడా కేసీయార్ (Kalvakuntla Chandrasekhar Rao) అనిపించుకోగలుగుతారు.