Keerthy Suresh Pet Dog.. మామూలుగా అయితే, రాజయోగం.. అని గొప్పగా చెబుతుంటాం. కానీ, ఇకపై శునకయోగాన్ని గురించి కూడా గొప్పగా చెప్పుకోవాల్సిందే.!
కన్నడ కస్తూరి, నేషనల్ క్రష్ రష్మిక మండన్న.. తనతోపాటు తన పెంపుడు కుక్కకీ విమాన ప్రయాణాకయ్యే ఖర్చులు భరించాలంటూ నిర్మాతల్ని వేపుకు తింటోందట.. అలాగని ఓ గాసిప్ ప్రచారంలోకి వచ్చింది.
సెలబ్రిటీలంటే అంతే మరి.! మమ్మీలకీ, డమ్మీలకీ లగ్జరీలు కోరుకుంటారు.. ఈ క్రమంలో నిర్మాతకు తడిసి మోపెడైపోతుంటుంది.
కుక్క వర్సెస్ మనిషి.. ఎవరు గొప్ప.?
చరిత్రలోకి తొంగి చూస్తే, ఆర్తి అగర్వాల్ విషయంలో ఇలాంటి ఆరోపణలు చాలానే వున్నాయ్. అసలు ఏ హీరోయిన్ ఇలాంటి ఆరోపణల నుంచి తప్పించుకుందని.?
అయినా, కుక్క కోసం కూడా విమానం టిక్కెట్లు కొనాలని, నిర్మాతలపై ఒత్తిడి తీసుకురావడమేంటి.? ఛత్, కుక్క.. అని తేలిగ్గా తీసి పారేస్తే ఎలా.? ఈ రోజుల్లో పెంపుడు జంతువుల్ని కుటుంబ సభ్యులకంటే ఎక్కువగా చూసుకుంటున్నారు కొందరు.

నడి రోడ్డు మీద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైతే సెలబ్రిటీలు స్పందించరుగానీ, ఎక్కడన్నా ఓ కుక్కకి అన్యాయం జరిగితే, సోషల్ మీడియాలో వెక్కి వెక్కి ఏడ్చేస్తారు.. జంతువుల హక్కుల కోసమంటూ గొంతు విప్పుతారు.
Keerthy Suresh Pet Dog.. శునక రాజసం.!
ఇంట్లో, అమ్మా నాన్నకి, ఇతర కుటుంబ సభ్యులకు మాత్రం కుక్కలకు ఇచ్చే ప్రాధాన్యతలో వందో వంతు కూడా ఇవ్వని సెలబ్రిటీలు ఎందరో.!
సరే, ఆ సంగతి పక్కన పెడదాం.. కుక్క రాజసం.. అదేనండీ, శునక యోగం గురించి మాట్లాడుకుందాం.
‘మహానటి’ కీర్తి సురేష్కీ ఓ పెంపుడు కుక్క వుంది. దానికీ ఓ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వుంది. ఆ కుక్క తొలిసారిగా విమానమెక్కింది.. దాని యజమానితో సహా.!
Also Read: Kangana Ranaut.. వామ్మో.! ఏం తెలివి.? క్లీన్ బౌల్డ్ చేసేస్తోందే.?
అద్గదీ అసలు సంగతి. రష్మిక మండన్నకి చేతకాలేదుగానీ, కీర్తి సురేష్ ఏకంగా చార్టర్డ్ విమానంలో తన కుక్కకి ‘గగన విహారం’ చేయించిందంటూ నెటిజనం సెటైర్లేస్తున్నారు.
అన్నట్టు, రష్మిక పెంపుడు కుక్కకి విమాన ప్రయాణమంటే భయమట.! వావ్.! ఇది ఇంకాస్త ఇంట్రెస్టింగ్ కదా.?