Keerthy Suresh పరిచయం అక్కర్లేని పేరది.! ‘మహానటి’ సినిమాతో నిజంగానే ‘మహానటి’ అనిపించుకుందీ బ్యూటీ.! అందానికి అందం.. ఆపై నటనా ప్రతిభ.!
తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టార్‌డమ్ సంపాదించుకున్న కీర్తి సురేష్, గ్లామర్ విషయంలో ఇప్పటిదాకా ఎక్కడా హద్దులు దాటలేదు.
కానీ, ఇకపై హద్దులు దాటేసేలానే వుంది. ఇదిగో, ఈ ఫొటోనే అందుకు నిదర్శనం. వెకేషన్‌లో భాగంగా, ఇదిగో ఇలా జలకాలాడుతూ కనిపించింది కీర్తి సురేష్.
Keerthy Suresh ఇదో నయా ట్రెండ్.!
స్విమ్మింగ్ పూల్‌లో ఇష్టమైన ఆహారం.. ఆ కిక్కే వేరప్పా.! మాల్దీవుల్లో ఇలా ప్రకృతి అందాల నడుమ, జలకాలాడుతూ.. ఇష్టమైన ఫుడ్‌ని ఎంజాయ్ చేయడం ఓ ట్రెండ్.
థాయిలాండ్ డైరీస్.. అంటూ ఠాయిలాండ్ వెకేషన్ విషయాల్ని ఇదిగో కీర్తి సురేష్ ఇలా అభిమానులతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
మాల్దీవుల్లోనే కాదు, చాలా పర్యాటక ప్రాంతాల్లో ఈ తరహా సౌకర్యాల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్నారు.
అలా ఎంజాయ్ చేయడంలో అందాల భామల రూటే సెపరేటు. ఆ అందాల భామల లిస్టులో ఇప్పుడు కీర్తి సురేష్ కూడా చేరిపోయింది.
ట్రోలింగ్ ఓ వైపు.. పొగడ్తలు ఇంకో వైపు..
బొత్తిగా బరి తెగించేశావ్.. అంటూ కీర్తి సురేష్ మీద ట్రోలింగ్ జరుగుతోంది సోషల్ మీడియాలో. అదే సమయంలో ‘హౌ బ్యూటిఫుల్..’ అంటూ కీర్తి అందానికి ఫిదా అవుతున్నారు చాలామంది.
Also Read: Samantha Ruth Prabhu.. అప్పుడూ! ఇప్పుడూ! అన్నీ మారాయ్.!
అయినా, అందం చూడవయా.. ఆనందించవయా.. అన్నట్టుండాలిగానీ, ఈ ట్రోలింగ్ ఏంటి.? ఎవరి గోల వారిది.!
