Ketika Sharma Dance పూరి జగన్నాథ్ తనయుడు పూరి ఆకాష్ హీరోగా రూపొందిన ‘రొమాంటి్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బొద్దుగుమ్మ కేతిక శర్మ.
‘లక్ష్య’ తదితర సినిమాల్లో నటించిన కేతిక శర్మ, తెలుగులో ఇప్పుడిప్పుడే పెద్ద పెద్ద అవకాశాలూ దక్కించుకుంటోంది.
సినిమాల్లోకి రాకముందు, యూ ట్యూబ్ అలాగే పలు రకాలైన సోషల్ మీడియా వేదికల ద్వారా కేతిక శర్మ (Ketika Sharma) పాపులారిటీ పెంచుకుంది.
కాస్త బొద్దుగా వున్నా, డాన్స్ మూమెంట్స్ విషయంలో అయితే, మెరుపు తీగలా కదలడం కేతిక శర్మ (Ketika Sharma) స్పెషాలిటీ.
Ketika Sharma Dance.. డాన్స్ కెవ్వుకేక.!
తాజాగా కేతిక శర్మ నుంచి ఓ డాన్స్ వీడియో బయటకు వచ్చింది. ‘జూమ్’ అంటూ సాగే కవర్ సాంగ్‌లో కేతిక శర్మతోపాటు, సెలబ్రిటీ కొరియోగ్రాఫర్ మెల్విన్ లూయిస్ అద్భుతమైన రీతిలో డాన్స్ చేశాడు.
ఇటు కేతిక, అటు మెల్విన్.. ఇద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ పాటకి హైలైట్‌గా చెప్పుకోవచ్చు. నటనలో ఇంకాస్త పరిణతి సాధించాల్సి వున్నా, కేతిక శర్మ (Ketika Sharma) డాన్సుల్లో సింప్లీ సూపర్బ్.
Also Read: ఎర్ర గులాబీ.! సెగలు రేపుతున్న సమంత సోయగం.!
డాన్సులే కాదండోయ్, కేతిక శర్మ (Actress Ketika Sharma) పాటలు కూడా బాగా పాడగలదు. కొన్నాళ్ళ క్రితం ఓ మ్యూజిక్ వీడియో విడుదల చేసింది ఈ బ్యూటీ. అందులో ఆమె పాటకి ఫిదా అయ్యారంతా.!

ఒకరకంగా చెప్పాలంటే తనను తాను మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా అభివర్ణిస్తుంటుంది కేతిక శర్మ. కాస్త లక్కు కూడా కలిసొస్తే, ఈ బొద్దుగుమ్మ.. తెలుగు నాట స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.