Ketika Sharma.. మొన్నీమధ్యనే ‘రంగ రంగ వైభవంగా’ అంటూ పంజా వైష్ణవ్ తేజ్ సరసన ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసేసింది బొద్దుగుమ్మ కేతిక శర్మ.
అప్పుడేమో తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో.! త్వరలో ఆ వైష్ణవ్ తేజ్ అన్నయ్య సాయి ధరమ్ తేజ్‌తోనూ కేతిక శర్మ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతోందా.?
Ketika Sharma.. వినోదియ సితం.. రీమేక్ కోసం.!
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో ‘వినోదియ సితం’ రీమేక్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. సముద్ర ఖని దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందబోతోంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం సాయి ధరమ్ తేజ్ ఖరారయ్యాడు. అయితే, ఇంతవరకు అధికారికంగా ఈ కాంబినేషన్‌పై ఎలాంటి ప్రకటనా రాలేదు.
Also Read: ప్రభాస్‌తో కృతి సనన్ ఎంగేజ్మెంట్.! జర ఒప్పేసుకోరాదే.!
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నెలలోనే (ఫిబ్రవరి 14న అంటున్నారు) ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమయ్యే అవకాశం వుంది.
శరవేగంగా సినిమా షూటింగ్ కూడా పూర్తయిపోతుందట. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్‌కి జోడీగా కేతిక శర్మ పేరు దాదాపు ఖాయమైపోయినట్లు తెలుస్తోంది.
పూర్తి వివరాలు వెల్లడి కావాల్సి వుంది.