Kiara Advani New Thinking.. కెరీర్ మొదట్లో అనుకోకుండా కొన్ని తప్పులు చేశానంటోంది ఆ ముద్దుగుమ్మ.
ఆ తప్పులు ఒకింత ఆమె కెరీర్‌ని మలుపు తిప్పాయ్.. అలాగే కొన్ని విమర్శల పాలు చేశాయ్ కూడా.! ఇంతకీ ఎవరా ముద్దుగుమ్మ.? ఏంటా కథ.?
‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా పరిచమైంది అందాల భామ కియారా అద్వానీ. తొలి సినిమాకే సూపర్ సక్సెస్ అందుకుంది.
సక్సెస్‌తో పాటూ, టాలీవుడ్ జనాల మనసు కూడా విశేషంగా గెలుచుకుంది.
వస్తూ వస్తూనే రెండు పెద్ద ప్రాజెక్టులతో ఎంట్రీ ఇచ్చింది కియారా.. రెండో సినిమా కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో జత కట్టింది.
Kiara Advani New Thinking.. ‘లస్ట్’ అయితేనేం, అదే కెరీర్ టర్నింగ్.!
అయితే, బోణీ బావుంది కానీ, ద్వితీయ విఘ్నం తప్పించుకోలేకపోయింది. రామ్ చరణ్‌తో కియారా నటించిన ‘వినయ విధేయ రామ’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
దాంతో, టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసి బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ కెరీర్ మొదట్లో నత్త నడక సాగింది. ఆ టైమ్‌లోనే ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ సిరీస్ ఆఫర్ వచ్చింది.

వెనకా ముందూ ఆలోచించకుండా ఆ ఆఫర్‌ని స్వీకరించేసింది కియారా (Kiara Advani). ఆ సిరీస్‌తో కియారాకి వచ్చిన పాపులారిటీ మాటల్లో చెప్పలేం.
ఆ వెంటనే ‘కబీర్ సింగ్’ (అర్జున్ రెడ్డి రీమేక్)లో నటించింది. ఈ రెండింట్లోనూ బోల్డ్ సన్నివేశాల్లో రెచ్చిపోయింది కియారా అద్వానీ.
అదే ఆమె కెరీర్‌ని టర్న్ చేసేసింది. విమర్శల పాలైనా.. అందరి దృష్టీ తనపై పడేలా చేసుకుంది. ఇక ఆ పై బాలీవుడ్‌లో వెనక్కి తిరిగి చూసుకోలేదు కియారా అద్వానీ.
ఇకపై అలాంటి పాత్రలు చేయను.!
స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు. అయితే, ఇప్పుడు మాత్రం అలాంటి పాత్రలను ఎంచుకోనని ఖచ్చితంగా చెప్పేస్తోంది.
కెరీర్ మొదట్లో తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేశాను.. ఇకపై అలాంటి తప్పులు చేయకూడదని డిసైడ్ అయ్యాను.. అని కియారా (Kiara Advani) చెబుతోంది.

బాలీవుడ్ యంగ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రాని పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌ని హ్యాపీగా కియారా హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది.
పర్సనల్ లైఫ్‌లో తాను చాలా సంతృప్తికంగా వున్నాననీ, అలాగే, ప్రొఫిషనల్ లైఫ్‌నీ ఎటువంటి విమర్శలకూ, కాంట్రవర్సీలకు తావివ్వకుండా హ్యాపీగా వుంచుకోవాలని అనుకుంటున్నా.. అంటోంది కియారా.!
Also Read: వాళ్ళకి రేణు దేశాయ్ సీరియస్ వార్నింగ్.!
ప్రస్తుతం ఆమె తెలుగులో ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తోంది. ఎక్కడ పోగొట్టుకుందో అక్కడే రాబట్టుకోవాలి అన్న చందంగా, రామ్ చరణ్ (Ram Charan) సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి వెళ్లిపోయింది.
మళ్లీ రామ్ చరణ్ (Ram Charan) సినిమాతోనే తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తోంది కియారా అద్వానీ. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో బిజీగా వుంది.