కింగ్ అక్కినేని నాగార్జున (King Akkineni Nagarjuna) బుల్లితెరపై హోస్ట్‌గా దుమ్ము రేపేస్తున్నాడు. ఆల్రెడీ మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షోతో అదరగొట్టిన నాగార్జున, బిగ్ బాస్ రియాల్టీ షో హోస్ట్‌గా కుమ్మేస్తున్నాడంతే. ఓపెనింగ్ డే కింగ్ పెర్ఫామెన్స్ (King Nagarjuna Bigg Boss Rating) కెవ్వు కేక.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఫస్ట్ వీకెండ్‌లో రెండు రోజులూ నాగార్జున తనదైన స్టైలింగ్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నాగార్జున అంటే మన్మథుడే.. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. న్యూ జనరేషన్‌కి తన హ్యాండ్సమ్ లుక్‌తో ఎప్పటికప్పుడు సవాల్ విసురుతూనే వుంటాడు. ఇక, మాట సంగతి సరే సరి. మాటలతో మాయ చేయడమెలాగో నాగార్జునకి (Manmadhudu2) బాగా తెలుసు.
అవు నిజం, నాగ్ ఎంత మాయ చేయకపోతే, బిగ్ బాస్ రియాల్టీ షో మునుపెన్నడూ లేని సంచలనాల్ని ఎలా సృష్టించగలుగుతుంది.? అవును, బిగ్ బాస్ రియాల్టీ షో (Bigg Boss Telugu 3) మూడో సీజన్, తెలుగులో గత రికార్డుల్ని బద్దలుగొట్టేసింది. తాజా టీఆర్పీ రేటింగుల (King Nagarjuna Bigg Boss Rating) ప్రకారం చూస్తే, బిగ్ బాస్ ఈసారి అద్భుతమైన రికార్డులు సొంతం చేసుకుంది. 17.92 టీఆర్పీ రేటింగ్‌ని బిగ్ బాస్ సాధించడమంటే చిన్న విషయమా.?
సుమారు 4.5 కోట్ల మంది బిగ్‌బాస్‌కి ట్యూన్ అయినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బుల్లితెర వీక్షకుల్లో 60 శాతం మంది తొలి వారం బిగ్ బాస్ రియాల్టీ షోని (Bigg Boss Reality Show) చూశారట. మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ పక్కన పెట్టి, కేవలం బిగ్ బాస్ మీదనే (Bigg Boss 3 Telugu) వ్యూయర్స్ ఫోకస్ పెట్టారంటే, కింగ్ నాగ్ హోస్ట్‌గా ఈ కొత్త సీజన్ ఎంత అద్భుతంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు.
ఇక, బిగ్ హౌస్‌లో (Bigg House) తొలి వీకెండ్ ఎలిమినేషన్‌కి గురయ్యింది సీనియర్ నటి హేమ (Hema). ఆమె స్థానంలో వచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా, బిగ్‌హౌస్ వ్యూయర్స్‌కి పెద్ద షాకే ఇచ్చింది. తమన్నాపై (Tamanna) సోషల్ మీడియాలో నెగిటివిటీ చాలా ఎక్కువ కన్పిస్తుండడం గమనార్హం. ఈ ఎఫెక్ట్ బిగ్‌బాస్ వీక్షకలుపై చాలా గట్టిగానే పడిందన్న ప్రచారం జరుగుతున్నా, అదెంతవరకు నిజమన్నది తేలాల్సి వుంది.
ఇదిలా వుంటే, మొదట యాక్టివ్‌గా కన్పించిన శ్రీముఖి (Sree Mukhi) రోజులు గడిచేసరికి స్లో అయిపోయింది. పునర్నవి (Punarnavi Bhupalam) మొదటి నుంచీ ఒకే పేస్ మెయిన్‌టెయిన్ చేస్తుండగా, వరుణ్ సందేశ్‌లో మార్పు స్పష్టంగా కన్పిస్తోంది. గేమ్ ప్లాన్‌ని ఇప్పుడు పెర్‌ఫెక్ట్‌గా వరుణ్ అమల్లో పెడుతున్నాడు.
వితిక – వరుణ్ (Varun Vithika) మధ్య విభేదాలు వచ్చినట్లుగా సంకేతాలు అందుతున్నాయి. తనను వరుణ్ (Varun Sandesh) పక్కన పెట్టేస్తున్నాడనే భావన వితికలో (Vithika Varun) కలుగుతోంది. దీనంతటి కారణం పునర్నవి అంటూ తొలుత వాపోయింది వితిక (Vithika Sheru). ఆ తర్వాత తమన్నాపై (Tamanna Simhadri) వితిక గుస్సా అవుతోంది. మొదటి నుంచీ వితిక, హౌస్‌లో ఎవరో ఒకరితో గొడవ పెట్టుకుంటూనే వుంది. తొలి గొడవ మహేష్ విట్టాతో స్టార్ట్ అయ్యిందామెకి.
షోలో మంచి బాలుడెవరంటే బాబా భాస్కర్ (Baba Bhaskar). డల్‌గా వుంటున్న క్యాండిడేట్‌గా జాఫర్ పేరు చెప్పుకోవచ్చు. అషు రెడ్డి, హిమజ.. ఇంకా తమ స్థాయికి తగ్గ గేమ్ చూపించడంలేదు. కండల వీరుడిగా అలీ రెజా ఎక్స్‌పోజింగ్ బిగ్ హౌస్‌లో ఎక్కువైపోయింది. రవి కృష్ణ ఈ మధ్య తరచూ ఎవరో ఒకరి కారణంగా కార్నర్ అవుతున్నాడు.
ఓవరాల్‌గా హౌస్‌లో (King Nagarjuna Bigg Boss Rating) వాతావరణం మొదటి వారంతో పోల్చితే రెండో వారం కొంత డల్ అయినట్లే కన్పిస్తోంది. నాగ్ రాకతో, హౌస్‌లో కొత్త ఉత్సాహం రావాల్సి వుంది. అలా జరగాలంటే వీకెండ్ షో వరకూ వెయిట్ చెయ్యాల్సిందే. అయితే, ఈ వీక్ ఎవరు హౌస్ నుంచి వెళ్ళిపోతారన్నదీ ఆసక్తికరమే. వెళతారు సరే, కొత్తగా ఎవరైనా వస్తారా.? వచ్చే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయని సమాచారమ్.