Krithi Shetty Nithin Movie.. బేబమ్మా.! ఎంత పని చేశావ్.? అప్పట్లో వద్దన్నావట కదా.? ఇప్పుడేమో, ఎగబడుతున్నావట కదా.!
నితిన్ – వెంకీ కుడుముల – రష్మిక మండన్న (Rashmika Mandanna) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా గురించే ఇదంతా.!
ఈ సినిమాలో తొలుత హీరోయిన్‌గా కృతి శెట్టి (Krithi Shetty) అనుకున్నారట. అయితే, కృతి అప్పట్లో ఆ అవకాశాన్ని లైట్ తీసుకుందట.
ఏంటీ నిజమేనా.?
ఇంతకీ, ఇదంతా నిజమా.? కాదా.? ఏమో, నిజమేనేమో.! నిజం కాకపోవచ్చునేమో.! కానీ, అది నిజమేనంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘కస్టడీ’ సినిమా డిజాస్టర్‌తో కృతి శెట్టికి (Krithi Shetty) పెద్ద షాక్ తగిలింది. ఈ మధ్య ఆమెకి షాకుల మీద షాకులు తగులుతూనే వున్నాయి.
ఏ సినిమాలో ఆమె నటించినా, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతోంది. ఈ విషయంలో ఆమెను పూర్తిగా తప్పు పట్టేయడానికి వీల్లేదు.
అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా.!
అప్పుడేమో గోల్డెన్ లెగ్.. ఇప్పుడేమో.!
‘ఉప్పెన’ సినిమాతో తెలుగు తెరపై తెరంగేట్రం చేసిన కృతి శెట్టికి (Krithi Shetty) మొదట్లో పట్టిందల్లా బంగారమే అన్నట్లుండేది. అప్పట్లో ఆమెనంతా గోల్డెన్ లెగ్ అన్నారు.
Also Read: Tillu Square: టిల్లుగాని ‘ఆ’ డోసు కూడా ‘స్క్వేర్’ అయ్యిందే.!
ఇప్పుడైతే, కృతి శెట్టి పేరు చెప్పగానే ఐరన్ లెగ్ అంటున్నారు. ఈ విషయమై కృతి శెట్టి కూడా గుస్సా అవుతోంది. తనవరకూ ప్రయత్న లోపమేమీ లేదన్నది ఆమె వాదన.
కాగా, నితిన్ – వెంకీ కుడుముల – రష్మిక మండన్న (Rashmika Mandanna) కాంబోలో వస్తోన్న సినిమాలో కృతి శెట్టి ఓ స్పెషల్ రోల్‌లో కనిపించబోతోందన్నది తాజా ఖబర్.
అంటే, కృతి శెట్టి (Krithi Shetty) సెకెండ్ హీరోయిన్ అనుకోవాలా.? గెస్ట్ రోల్ అని భావించాలా.? ఇవేవీ కాదు, స్పెషల్ సాంగ్ అని ఫిక్సవ్వాలా.?
అన్నట్టు, అప్పుడు వద్దనుకున్న ఆ సినిమా కోసం.. స్వయంగా కృతి శెట్టి ఎగబడుతోందన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ కథనం.!
హీరోతో వున్న పరిచయాల నేపథ్యంలో, ఒక్క ఛాన్స్.. అంటూ కృతి శెట్టి స్వయంగా నితిన్ వెంట పడిందనీ, ఆ ఫలితమే.. ఈ ఛాన్స్.. అని అంటున్నారు. నిజమేనా.? నమ్మొచ్చా.?