మహేష్ హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో ముద్ర వేయించుకుంది ముద్దుగుమ్మ కృతి సనన్ (Kriti Sanon Impossible Lovestory). సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘1 – నేనొక్కడినే’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైంది కృతి సనన్.
ఆ తర్వాత ‘దోచేయ్’ సినిమాలో నటించింది. ఇక, అంతే మళ్లీ తెలుగులో కనిపించలేదు. అందుకు కారణం అమ్మడికి టాలీవుడ్ కలిసి రాకపోవడమే.
రెండు సినిమాలూ డిజాస్టర్స్‌గా మిగిలాయ్. దాంతో, టాలీవుడ్ తనకు సరిపడదనుకుందో ఏమో, మళ్లీ బాలీవుడ్‌కి చెక్కేసింది.
Kriti Sanon Impossible Lovestory:.. అది అప్పుడు ఇది ఇప్పుడు.!
అక్కడ కూడా మొదట్లో కృతి సనన్ ఇమడలేకపోయింది. ‘మిమి’ అనే సినిమాతో హిట్టు కొట్టి పాతుకు పోయింది. ఆ తర్వాత వరుస ఆఫర్లు.. ఊహించని విధంగా స్టార్‌డమ్ దక్కించుకుంది.
Also Read: Mrunal Thakur.. అవకాశాల్లేక అంత పని చేసిందా.?
ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా గడిపేస్తోందక్కడ. మొన్నీ మధ్యనే ‘భేడియా’, ‘షెహ్‌జాదా’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
త్వరలో ‘ఆది పురుష్’ సినిమాతో సందడి చేయనుంది. కాగా, కృతి సనన్ ( Kriti Sanon ) నటించిన మరో కొత్త సినిమాకి తాజాగా టైటిల్ అనౌన్స్ చేశారు.
ఆ టైటిల్ ఏంటీ.! అంత ఘాటు రొమాన్స్ ఏంటీ.!
షాహిద్ కపూర్, కృతి సనన్ జంటగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఈ సినిమాకె సంబంధించి టైటిల్ అనౌన్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్ ఇప్పుడు ట్రెండింగ్ అయ్యింది. షాహిద్‌తో కలిసి రొమాంటిక్ యాంగిల్‌లో వున్న పోస్టర్ అది. బైక్‌పై ఘాటుగా లిప్ లాక్ లాగేసేందుకు సిద్ధంగా వున్న జంటగా షాహిద్, కృతి సనన్ ( Kriti Sanon ) కనిపిస్తున్నారు ఈ పోస్టర్‌లో.
యూత్‌లో మాంచి కిక్కు ఇస్తోంది ఈ పోస్టర్. అక్టోబర్‌లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి ఏన్ ఇంపాజిబుల్ లవ్ స్టోరీ (అసాధ్యమైన ప్రేమకథ)’ అని టైటిల్ పెట్టారండోయ్.
ఇంపాజిబుల్ లవ్ స్టోరీ అంటున్నారూ..! బైక్‌పై ఇంత ఘాటు రొమాన్స్ ఏంటీ.! అని పోస్టర్ చూసిన వాళ్లంతా ఆశ్చర్యపోతున్నారు.