Kriti Sanon Sita Adipurush.. ప్రభాస్ అంటేనే డార్లింగ్.! ప్రభాస్‌ని ఇష్టపడనివారు ఎవరుంటారు.? అయినాగానీ, చాలామంది ప్రభాస్‌ని ఉద్దేశించి ‘మితభాషి’ అని అంటుంటారు.
ఇంతకీ, ఇందులో నిజమెంత.? ప్రభాస్ మితభాషి కాదు. కాస్తంత మొహమాటం ఎక్కువ అంతే. ఒక్కసారి మాట్లాడటం మొదలు పెడితే, ఇక ఆ తర్వాత వ్యవహారం వేరే లెవల్‌లో వుంటుంది.
బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా ఈ విషయమై ప్రభాస్ గురించి వెరీ వెరీ స్పెషల్‌గా చెప్పుకొచ్చింది.
Kriti Sanon Sita Adipurush.. ఆ కళ్ళలో.. బోల్డంత ప్రేమ..
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ కళ్ళు చాలా చాలా మాట్లాడతాయట. ఆ కళ్ళలో స్వచ్ఛత కనిపిస్తుందట. ప్రేమాభిమానాలు వుంటాయట.
ఈ విషయాల్ని స్వయంగా ‘సీత’ చెప్పింది. అదేనండీ, ‘ఆదిపురుష్’లో సీతలా కనిపించనుంది కదా.. ఆ కృతి సనన్ (Kriti Sanon).

అన్నట్టు, ప్రభాస్ – కృతి సనన్ పెళ్ళి చేసుకోబోతున్నారట కదా.? ఈ విషయమై కృతి సనన్ గతంలోనే క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్ కేవల కో-స్టార్ మాత్రమేనని చెప్పిందామె.
ప్రభాస్ మాత్రమే..
‘ఆదిపురుష్’లోని శ్రీరాముడి పాత్రలో ప్రభాస్ (Prabhas) తప్ప ఇంకొకర్ని ఊహించుకోలేమని కృతి సనన్ (Kriti Sanon) చెప్పుకొచ్చింది.
‘ఎవర్నయినా ప్రభాస్ చాలా బాగా ఇష్టపడతాడు. వారి యోగ క్షేమాల గురించి తెలుసుకుంటాడు..’ అంటున్న కృతి సనన్, ప్రభాస్‌ని భోజన ప్రియుడిగా అభివర్ణించింది.
Also Read: Meera Jasmine.. రీ ఎంట్రీలో లక్కు ‘టెస్టు’ పాస్ అవుతుందా.?
సినిమా చాలా బాగా వచ్చిందనీ, ‘ఆదిపురుష్’ సినిమా గురించి కొన్ని దశాబ్దాలపాటు సినీ ప్రియులు చర్చించుకుంటారనీ అంటోంది కృతి సనన్.
ప్రతి సినిమా కోసం చాలా చాలా కష్టపడుతుంటామనీ, ‘ఆదిపురుష్’ సినిమా కోసం ఇంకాస్త ఎక్కువ కష్టపడ్డామని కృతి సనన్ చెబుతోంది.
అయితే, అది ఇష్టమైన కష్టమంటోన్న కృతి సనన్, తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం, ‘ఆదిపురుష్’ సక్సెస్‌తో లభిస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తోంది.
ఒక్కసారి కాదు, ప్రభాస్‌తో మళ్ళీ మళ్ళీ కలిసి నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నట్లు చెప్పింది కృతి సనన్.