Kushi Samantha Vijay Chemistry.. కెమిస్ట్రీ అంటే ఇలా వుండాలి.! స్టేజ్ పెర్ఫామెన్స్ విషయంలోనూ ఇంత కెమిస్ట్రీ చూపిస్తే.. ఇక వెండితెరపైనో.!
విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ (Kushi Movie) సినిమా విడుదలకు సిద్ధమైంది. శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.
మయోసైటిస్‌తో బాధపడుతున్న సమంత, ఆ కారణంగానే సినిమా షూటింగ్‌కి సరిగ్గా అందుబాటులో లేకపోవడంతో, కాస్త ఆలస్యమయ్యింది సినిమా విడుదలలో.

ఎలాగైతేనేం, ‘ఖుషి’ (Kushi Movie) సినిమాని పూర్తి చేసి, విడుదలకు సిద్ధం చేశారు. తాజాగా, సినిమా మ్యూజికల్ కాన్సెర్ట్ జరిగింది.
Kushi Samantha Vijay Chemistry.. మయోసైటిస్ ఎక్కడ.?
సమంత తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోందనీ, సినిమాలకు గుడ్ బై చెప్పేసిందనీ గుసగుసలు వినిపిస్తున్న వేళ, స్టేజ్ పెర్ఫామెన్స్‌లో సమంత అదరగొట్టేసింది.
సమంత అంటేనే హై ఎనర్జీ.! ఆ ఎనర్జీ మొత్తాన్ని, స్టేజ్ మీద చూపించింది సమంత (Samantha Ruth Prabhu).! తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది.

ఇక, సమంత (Samantha Ruth Prabhu) – విజయ్ దేవరకొండ (Vijay Deverakonda).. ఈ ఇద్దరూ ఇచ్చిన స్టేజ్ పెర్ఫామెన్స్ చూస్తే, ‘వాట్ ఏ కెమిస్ట్రీ’ అనిపించకమానదు.!
కెమిస్ట్రీ వేరే లెవల్.!
కెమిస్ట్రీ విషయంలో, సమంత – విజయ్ దేవరకొండ.. ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడ్డారు. ఈ సమంతేనా, మయోసైటిస్‌తో బాధపడింది.? అన్న అనుమానం రాకుండా వుండదు.
గ్లామర్ విషయంలోనూ సమంత అస్సలు తగ్గలేదు. గ్లామర్ సంగతి పక్కన పెడితే, సమంతతో విజయ్ దేవరకొండ స్టేజ్ మీద చేసిన, చేయించిన ఆక్రోబాటిక్స్.. అన్‌మ్యాచబుల్ అంతే.!
Also Read: Milky Beauty Tamannah.. నా తప్పు ఏమున్నదబ్బా.!
తెలుగు ప్రజలారా.. అంటూ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కూడా తన మునుపటి జోష్‌ని ఈ ఈవెంట్‌లో చూపించాడు.

‘లైగర్’ సినిమాతో కాస్త డీలా పడ్డ విజయ్ దేవరకొండలో మునుపటి ‘రౌడీ’ కనిపించాడని నిస్సందేహంగా చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండతో పోల్చితే, సమంత ప్రదర్శించిన డబుల్ ఎనర్జీ, ‘ఖుషి’పై అంచనాలు మరింత పెరిగేందుకు కారణమవుతోంది.