Kushi Samantha Vijay Deverakonda.. సమంత, విజయ్ దేవరకొండ కలిసి గతంలో ‘మహానటి’ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో క్యూట్ రొమాంటిక్ కపుల్‌గా కనిపించి మెప్పించిందీ జంట.
ఇప్పుడు ‘ఖుషి’ అంటూ మరోసారి వస్తున్నారు. ‘ఖుషి’ సినిమాలో సమంత (Samantha Ruth Prabhu), విజయ్ దేవరకొండ మధ్య కెమిస్ర్టీ వేరే లెవల్‌లో వుందని ప్రచార చిత్రాల ద్వారా అర్ధమవుతోంది.
శివ నిర్వాణ దర్శకత్వంలో అందమైన లవ్ స్టోరీగా రూపొందుతోన్న చిత్రం ‘ఖుషి’. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతోంది. ఇంతవరకూ వరుసగా లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేశారు.
Kushi Samantha Vijay Deverakonda.. క్యూట్ క్యూట్‌గా హాట్ కాఫీ రొమాన్స్..
అన్నీ కన్నుల పండగలా అనిపిస్తున్నాయ్. ‘నా రోజా నువ్వే..’ ‘ఆరాధ్య’, ‘ఖుషీ..’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్స్ ఇప్పటికే యూ ట్యూబ్‌లో కుప్పలు తెప్పలుగా వ్యూస్ రాబట్టేశాయ్.!
ఆగస్ట్ 9న ‘ఖుషి’ ట్రైలర్ రానుందని మేకర్లు ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో విజయ్ దేవరకొండ, సమంత మధ్య రొమాంటిక్ టచ్ చాలా క్యూట్‌గా వుంది.
ఈ ఇద్దరి మధ్యా ఆన్ స్క్రీమ్ కెమిస్ట్రీ మరింత రొమాంటిక్‌గా వుండబోతోందని ఈ ఫొటో చూశాక ఇరువురి అభిమానులూ ఫిక్సయిపోతున్నారు.

ఆ మాటకొస్తే, ఇంతవరకూ ‘ఖుషీ’ సినిమా నుంచి వదిలిన పోస్టర్లన్నీ రొమాంటిక్ టచ్‌ని అలా అలా కంటిన్యూ చేస్తూనే వచ్చాయ్.
తాజా స్టిల్ అంతకు మించి.! క్యూట్‌గా కనిపిస్తూనే హాట్ హాట్‌గా కాఫీ లాగించేస్తున్నారు. ఈ జంటకు తోడు పక్కనే ఓ క్యూట్ పప్పీ.. ఈ స్టిల్‌ని మరింత అందంగా మార్చేసింది.
Also Read: ఎకరం వెయ్యి కోట్లు.! ఎవడికి ఉపయోగం.!
‘ఖుషి’ సినిమా ఇటు విజయ్ దేవరకొండకీ, అటు సమంతకీ ఇద్దరికీ ప్రెస్టీజియస్ మూవీనే. ‘లైగర్’ దెబ్బతో ఢీలా పడిపోయి వున్నాడు రౌడీ.
‘యశోద’ (Yashoda), ‘శాకుంతలం’ (Shaakuntalam) సినిమాల ఫెయిల్యూర్స్‌తో సమంత సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో ‘ఖుషి’ వీరిద్దరి కెరీర్‌ని ఖుషి ఖుషీగా మార్చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.