Table of Contents
Lady Power Star Sai Pallavi: సాయి పల్లవి.. లేడీ పవర్ స్టార్ అయిపోయింది. ఔను, ఆమెని లేడీ పవర్ స్టార్.. అంటూ అభివర్ణించేశారు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్. ఓ సినిమా ఫంక్షన్‌కి సాయిపల్లవి ముఖ్య అతిథిగా హాజరైతే, అదే వేడుకకు సుకుమార్ కూడా హాజరయి ఈ వ్యాఖ్యలు చేశారు.
సుకుమార్ ఎందుకు సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్.. అని అభివర్ణించినట్లు.? నిజానికి, సాయిపల్లవి ఇంకా స్టార్‌డమ్ పరంగా నెంబర్ వన్ చెయిర్ దక్కించుకోలేదు. అగ్ర హీరోలనదగ్గవారితో సినిమాలూ చేయలేదు. నిజానికి, ఆమెను కమర్షియల్ హీరోయిన్.. అని ఎవరూ అనరు.
సాయి పల్లవి వెరీ వెరీ వెరీ స్పెషల్.!
సాయి పల్లవి (Sai Pallavi) గ్లామర్ పేరుతో అసభ్యత ప్రదర్శించదు. వెకిలి కామెడీకి కూడా ఆమె చాలా దూరం. చాలా చాలా సహజంగా వుంటుంది సినిమాల్లో ఆమె నటన. డాన్సుల్లో అయితే సాయి పల్లవి ది బెస్ట్. ఆమెను మించిన డాన్సర్ బహుశా సినీ పరిశ్రమలో ఇంకొకరుండరనడం అతిశయోక్తి కాదేమో.
ఇక, సాయి పల్లవి ‘లేడీ పవర్ స్టార్’ (Lady Power Star) అనిపించుకోవడానికి తగ్గ అన్ని అర్హతలూ కలిగి వుంది. ఔను, సాయి పల్లవిని నటిగానే కాదు, అంతకు మించి.. అన్నట్టుగా ఆరాధిస్తారు ఆమె అభిమానులు. నిజానికి, సాయి పల్లవి ఎవరికైనా నచ్చేస్తుంది. ‘నచ్చకపోవడం’ అనేదే వుండదు ఆమె విషయంలో.
పాపం సాయి పల్లవి.. అలా ఏడిపించేస్తున్నారేంటీ.?
మొన్నామధ్య ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) సినిమా ప్రమోషనల్ ఈవెంట్ సందర్భంగా సాయి పల్లవి ఏడ్చేసింది. అందుక్కారణం.. ఆమె మాట్లాడేందుకు మైక్ అందుకోగానే, అభిమానులు ‘గోల’ చేయడం. గోల అంటే.. నెగెటివ్ కోణంలో కాదు. ఆమె పట్ల ఆరాధనా భావం.

పవన్ కళ్యాణ్ విషయంలోనే ఇలాంటి ఆరాధనా భావం చూస్తుంటాం. హీరోయిన్లలో సాయి పల్లవి ఆ ప్రత్యేకమైన గౌరవం దక్కిందనేది బహుశా సుకుమార్ ఉద్దేశ్యం అయి వుండొచ్చు. అందుకే, ‘లేడీ పవర్ స్టార్’ అని సుకుమార్, సాయి పల్లవికి బిరుదు ఇచ్చేశారు.
అన్నట్టు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పేరు ముందు ‘పవర్ స్టార్’ వాడొద్దంటూ అభిమానులకీ, తనతో సినిమాలు తీసే దర్శక నిర్మాతలకీ స్పష్టం చేసేశారు. ‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమా టైటిల్స్‌లో ‘పవర్ స్టార్’ (Power Star Pawan Kalyan) అనే ప్రస్తావనే రాలేదు కూడా.!
Lady Power Star Sai Pallavi.. అతి సర్వత్ర వర్జయేత్.!
ఏదిఏమైనా, సాయి పల్లవిని మరీ అంతలా ఏడిపించేయడం సోకాల్డ్ అభిమానులకు అస్సలు తగదు. ఆమె ఏం చెబుతోందో వినాలి.. ఆ ఓపిక వుండాలి.
Also Read: హీరోయిన్లకేనా ఆ క్వశ్చన్.! హీరోలకైతే అక్కర్లేదా.?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద ‘అతి అభిమానం’ ఎలాగైతే, ఆయన్ని చెడ్డవాడిగా కొందరి దృష్టిలో చూపిస్తోందో, సాయి పల్లవికి (Sai Pallavi)కూడా అదే ప్రమాదం పొంచి వుందన్న సంగతిని ఆమె అభిమానులు గుర్తుంచుకోవాలి.
సాయి పల్లవి (Sai Pallavi) సైతం.. ఇలాంటి అభిమానులతో ఒకింత అప్రమత్తంగా వుండాల్సిందే.