Lahari Shari అలాగే Hamida.. ఈ ఇద్దరూ తిరిగి రావాల్సిందేనంటున్నారు బిగ్ బాస్ అభిమానులు.! బిగ్ బాస్‌కి కూడా అభిమానులు వుంటారా.? అంటే, లేకుండానే ఇంత పెద్ద సక్సెస్ అయ్యిందా బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో.? అని ఎదురు ప్రశ్నించాల్సి వస్తుంది.
లహరి షరి.. చాలా తక్కువ రోజులే బిగ్ హౌస్‌లో వుంది. ఆమె ఎప్పుడైతే షో నుంచి ఎలిమినేట్ అయ్యిందో.. ఆ తర్వాత బిగ్ బాస్‌కి గ్లామర్ లోటు వచ్చి పడింది. హమీదా వెళ్ళిపోయాక.. ఆ లోటు డబుల్ అయ్యింది. అందుకేనేమో, అటు లహరి.. ఇటు హమీదా అభిమానులు.. ‘బ్రింగ్ బ్యాక్ లహరి.. బ్రింగ్ బ్యాక్ హమీదా’ అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి చేసేస్తున్నారు.
Lahari Shari.. ఓట్లెయ్యలేదెందుకు.?
ఇప్పుడిలా హడావిడి చేయడం కన్నా, వాళ్ళు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయినప్పుడే సరిగ్గా ఓట్లు వేసి వుంటే అటు లహరి అయినా, ఇటు హమీదా అయినా బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యేవాళ్ళు కాదేమో.
గత సీజన్‌లోనూ ఇలాగే అడ్డగోలుగా ఎలిమినేషన్లు నడిచాయి.. దివి వద్త్య విషయంలో ఏం జరిగిందో అందరం చూశాం. అప్పుడూ ఇలాగే ఆమె అభిమానులు నానా హంగామా చేశారు. కానీ, దివి తిరిగి హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వలేదు.

వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. సాధ్యమయ్యేనా.?
కానీ, ఈసారి ఎందుకో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అనే ప్రచారమైతే గట్టిగా సాగుతోంది. ఒకవేళ అన్నీ కుదిరి లహరి, హమీదాలలో ఎవరో ఒకరు బిగ్ హౌస్‌లోకి వైల్డ్ కార్డు ద్వారా రీ-ఎంట్రీ ఇచ్చినా, ఈ సీజన్‌లో కొత్త ఊపు వచ్చే అవకాశమైతే కనిపించడంలేదు.
‘వరుసగా లేడీ కంటెస్టెంట్లను బయటకు పంపేస్తున్నారు..’ అంటూ బిగ్ బాస్ మీద వ్యతిరేకత పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో అదనపు గ్లామర్ కోసం లహరి (Lahari Shari), హమీదాలలో (Hamida) ఎవరో ఒకర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తీసుకొచ్చి ఓ రెండు మూడు వారాలు వుంచితే.. బిగ్ బాస్ మీద పడ్డ ‘లేడీ ద్వేషి’ అన్న అప్రపధ తొలగిపోతుందేమో.!
Also Read: కేతిక శర్మ ‘రొమాంటిక్’ న్యూ యాంగిల్.!