Lahari Shari Hugs Anchor Ravi అసలేం జరుగుతోంది బిగ్ హౌస్లో.. ‘ఎర్ర పార్టీ’కి చెందిన నేత నారాయణ (సీపీఐ), బిగ్ హౌస్లో జుగుప్సాకరమైన వ్యవహారాలు నడుస్తున్నాయనీ, దాన్ని వెంటనే బ్యాన్ చేసెయ్యాలని విమర్శిస్తే, ‘నాన్సెన్స్..’ అంటూ అపర మేధావి బాబు గోగినేని గొంతు చించుకున్నాడు. కానీ, సీనియర్ నటి ప్రియ, తోటి కంటెస్టెంట్లయిన రవి, లహరి మీద చేసిన ఆరోపణల సంగతేటి.?
యాంకర్ రవి (Anchor Ravi), లహరి షరి.. (Lahari Shari) అర్థరాత్రి రెస్ట్ రూమ్లో ‘హగ్’ చేసుకున్నారట.. అదేనండీ కౌగలించుకున్నారట. ఈ విషయాన్ని లేవనెత్తింది ప్రియ. అంతేనా, లహరి.. హౌస్లో మేల్ కంటెస్టెంట్లతోనే చనువుగా వుంటోందట.. లేడీ కంటెస్టెంట్లకి అస్సలు అందుబాటులో వుండటంలేదట. ఇదీ ప్రియ ఆరోపణ.
Also Read: బిగ్బాస్ వ్యధ: ‘అక్కడ’ చెయ్యెందుకు పెట్టావ్.!
వామ్మో.. బిగ్ బాస్ రియాల్టీ షోలో ఇలాంటివి కూడా జరుగుతాయా.? క్యారెక్టర్ అసాసినేషన్.. అదేనండీ, ఓ వ్యక్తి.. వ్యక్తిత్వాన్ని చంపేయడం.. అంటే ఇదే మరి. సిరి (Siri Hanmanth), తనకు తెలియకుండానే సన్నీ (Sunny VJ) మీద ఓ ఫిజికల్ గేమ్ సందర్భంగా ఆరోపణలు చేసింది.. దానికి నాగ్ క్లారిటీ ఇచ్చాడు.
మరిప్పుడు, బిగ్ హౌస్ (Bigg Boss Telugu 5) రెస్ట్ రూమ్లో ఏం జరిగిందో, వీకెండ్ షో సందర్భంగా హోస్ట్ నాగార్జున స్పష్టతనిస్తాడా.? అయినా, ఈ ఎపిసోడ్ ఎలా టెలికాస్ట్ చేయాలని నిర్వాహకులకు అనిపించిందట.? చెత్త.. పరమ చెత్త.. కాదు కాదు, అంతకు మించిన చెత్త.. జనం మీద బలవంతంగా రుద్దేస్తున్నారు.
Also Read: ‘బిగ్’ లవ్: షణ్ముఖ్, దీప్తి.. ఈ ప్రేమ ఎంత నిజం.?
ప్రియ తిట్టినట్లు, లహరి (Lahari Shari Hugs Anchor Ravi) ఏడ్చినట్లు.. రవి రెచ్చిపోయినట్లు.. ఇదంతా ఓ స్క్రిప్టు ప్రకారం జరగకపోతే, ఈ ఎపిసోడ్ ఎలా ప్రసారమవుతుంది.? పైగా, ఈ రచ్చ కోసమే పూర్తిగా ఓ ఎపిసోడ్ కేటాయించేశారు.. హౌస్లో రోజంతా ఇంకేమీ జరగనట్టు.
బిగ్ బాస్ సీజన్ 5 ద్వారా ప్రేక్షకులకు ఏదో అసభ్యకరమైన మెసేజ్ అయితే పంపిస్తున్నట్టున్నారు. కాదు కాదు, సమాజానికి హాని చేసేలా వ్యవహరిస్తున్నారన్నది.. మెజార్టీ అభిప్రాయం. సీనియర్ నటి, ఇంత దిగజారుడు వ్యవహారానికి ఎందుకు ‘యెస్’ చెప్పినట్లు.? ‘నేను ఇలాంటి డిస్కషన్ చేయలేను..’ అని చెప్పలేని స్థితిలో ఆమె వున్నారా.? జస్ట్ ఆస్కింగ్.!