LIGER Disaster.. దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ మీద కసి తీర్చుకున్నాడట.! ఔనా, అంతటి శతృత్వం ఇద్దరి మధ్యా ఏముందబ్బా.?
ఎవరో అంటున్న మాట కాదిది.! స్వయానా రౌడీస్.. అదేనండీ విజయ్ దేవరకొండ అభిమానులే, పూరి జగన్నాథ్ మీద చేస్తున్న విమర్శలివి.
‘లైగర్’ సినిమా మీద భయంకరమైన ట్రోలింగ్ జరుగుతోంది. ‘విజయ్ దేవరకొండ చాలా తప్పు చేశాడు.. దర్శకుడు పూరి జగన్నాథ్‌ని నమ్మడమే ఆ పెద్ద తప్పు..’ అంటున్నారు రౌడీస్.
‘విజయ్ దేవరకొండ చాలా చాలా కష్టపడ్డాడు. ఆ కష్టం ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తుంది. పూరి మాత్రం, విజయ్ దేవరకొండ కష్టాన్ని వృధా చేయడమే పనిగా పెట్టుకున్నాడు’ అన్నది రౌడీస్ వాదన.
LIGER Disaster.. పూరి జగన్నాథ్‌దేనా పాపమంతా.?
అరరె, పూరి జగన్నాథ్ ఎందుకిలా చేశావ్.? అయినా, ఎవరూ కావాలని ఫ్లాప్ సినిమా తీయరు కదా.? ఇంతకీ ‘లైగర్’ ఫైనల్ రిజల్ట్ ఏంటి.?

ఇంకేముంటుంది.? డిజాస్టర్ లైగర్.. (Liger) అనేస్తున్నారు ఇప్పటికే.! ఏమో, గుర్రం ఎగరావచ్చు.! ఈ మధ్య హిట్టు సినిమాలు డిజాస్టర్లుగా మిగిలిపోతున్నాయ్. డిజాస్టర్ సినిమాలు సోసో అనిపిస్తున్నాయ్.
ఒక్కటి మాత్రం నిజం. ‘లైగర్’ (Liger Movie) కోసం కనీ వినీ ఎరుగని రీతిలో ఖర్చు చేశారు. సినిమాని బీభత్సంగా ప్రమోట్ చేశారు. అన్నీ వృధాయేనా.? అంతేనేమో, అలాగే అనుకోవాలేమో.!
అయ్యయ్యో అనన్య..
బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) వేస్ట్ అయ్యిందట.! ఆమె వేస్ట్ అవుతుందని ఈ సినిమాలో (liger Hunt Begins) హీరోయిన్‌గా ఆమెను తీసుకున్నప్పుడే అంతా అనుకున్నారు.
Also Read: విరుగుట.. పెరుగుట కొరకే.! శిల్పా శెట్టి ప్రవచనం.!
అన్నట్టు, జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఈ ప్రాజెక్ట్ మిస్ చేసుకుని మంచి పనే చేసింది. లేదంటే, భయంకరమైన డిజాస్టర్ ఆమె కెరీర్‌లో వచ్చి వుండేదంటున్నారు.
చిత్రమేంటంటే, ‘లైగర్’ (Liger Movie Review) సినిమా మీద రౌడీస్ ఎక్కువగా నెగెటివిటీ స్ప్రెడ్ చేస్తుండడం. అంతలా వారిని ‘లైగర్’ హర్ట్ చేసినట్టుంది మరి.!