Table of Contents
Liger First Review.. లుంగీ కట్టినా ట్రెండు.. చిరిగిన జీన్స్ వేసినా ట్రెండు.! పరిచయం అక్కర్లేని పేరది.!
బ్రాండ్ పేరు ‘రౌడీ’.! ఆయన్ని ఫాలో అయ్యే యంగ్ రౌడీస్ వేలల్లో కాదు, లక్షల్లో వున్నారు.. ఆ సంఖ్య కోట్లలోకి చేరబోతోంది.!
రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ‘లైగర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ‘సాలా క్రాస్ బ్రీడ్.. వాట్ లగా దేంగే..’ అంటున్నాడు ఈ రౌడీ హీరో.!
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైగర్’ సినిమాపై భారీ అంచనాలున్నాయన్నది చిన్నమాట.! ఎందుకంటే, ఆ అంచనాలు పాన్ ఇండియా స్థాయిలో ఆకాశాన్నంటేశాయ్.
లైగర్ ఫస్ట్ రివ్యూ.. బొమ్మ ఎలా వుందబ్బా.?
ఇంతకీ, ‘లైగర్’ ఎలా వుంది.? ఇదిగిదిగో ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.! బాక్సాఫీస్ దద్దరిల్లిపోయేలా సినిమా రిజల్ట్ వుందంటూ ఎర్లీ రిపోర్ట్స్ షురూ అయ్యాయ్.!
గల్ఫ్ దేశాల్లో వుంటూ, ఇండియన్ సినిమాలకు తొలి రివ్యూలు ఇస్తుంటాడు ఉమైర్ సంధు. అయితే, తరచూ అతని రివ్యూలు బొక్క బోర్లా పడుతుంటాయనుకోండి.. అది వేరే సంగతి.
అయినాగానీ, ఉమైర్ సంధు రివ్యూల పట్ల సగటు సినీ అభిమాని చాలా ఇంట్రెస్టింగ్గా ఎదురుచూస్తుంటాడు. ఆ ఉమైర్ తాజాగా ‘లైగర్’ రివ్యూ ఇచ్చేశాడు.
సినిమా మొత్తాన్ని విజయ్ దేవరకొండ తన భుజాలపై మోసేశాడనీ, వన్ మ్యాన్ షో చేశాడనీ ఉమైర్ సంధు చెప్పారు. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్‌లో విజయ్ వీర లెవల్ పర్ఫామెన్స్ ఇచ్చేశాడట.

టెర్రిఫిక్ యాక్షన్ ఎపిసోడ్స్ అని అభివర్ణించారు. రాజమాతగా పేరు తెచ్చుకున్న రమ్యకృష్ణ ఈ సినిమా కోసం స్పెషల్ ప్యాకేజ్ పర్ఫామెన్స్ ఇచ్చారనీ ఉమైర్ ట్వీట్ చేశారు. డైరెక్షన్ బాగుందని చెప్పారు కానీ, స్టోరీ, స్ర్కీన్‌ప్లే విషయంలో ‘యావరేజ్’ అని ట్వీట్ చేశారు.
మొత్తానికి ‘లైగర్’.. విజిల్స్ వేసే పక్కా మాస్ ఎంటర్టైనర్ అని ఉమైర్ సంధు సర్టిఫికెట్ ఇచ్చేశారు. ఇంకేముంది ఇది చాలదా.. రౌడీ ఫ్యాన్స్‌కి. ధూమ్ ధామే.
Liger First Review.. పూరి ‘లైగర్’తో పెద్ద యజ్ఞమే చేశాడు..
ఇక, ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో వున్నాడు డైరెక్టర్ పూరీ జగన్నాధ్.
విజయ్ దేవరకొండ కూడా తన స్టామినాకి మించి కష్టపడ్డాడు ‘లైగర్’ సినిమా కోసం. కష్టపడి కండలు పెంచాడు. ఫిజిక్ పరంగా ఇంతకు ముందెన్నడూ లేని విధంగా మేకోవర్ చూపించాడు.
చాలా తక్కువ టైమ్‌లోనే సినిమాలు తెరకెక్కించి రిలీజ్ చేసే పూరీ జగన్నాధ్ ఈ సినిమా కోసం చాలా చాలా ఎక్కువ టైమ్ తీసుకున్నాడు.
బాక్సింగ్ లెజెండ్ సినిమాల్లో కనిపించడం ఇదే తొలిసారి..
బాక్సింగ్ లెజెండ్ అయిన మైక్ టైసన్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించిన సంగతి తెలిసిందే. ఆయన సినిమాల్లో నటించడం, అదీ ఓ తెలుగు సినిమాలో నటించడం ఇదే తొలిసారి.
ఛార్మి వల్లే మైక్ టైసన్ ఈ సినిమాలో నటించేందుకు ఒప్పుకున్నాడట. ఆయనను ఒప్పించడానికే దాదాపు ఒక సంవత్సరం పట్టిందట. పూరీ జగన్నాధ్ ఈ విషయాన్నితాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
విజయ్ దేవరకొండ ‘రియల్’ బంగారు కొండ
ఈ మధ్య కాలంలో నేను చూసిన జెన్యూన్ యాక్టర్ విజయ్ దేవరకొండ అని పూరీ చెప్పుకొచ్చాడు. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్‌లోనూ చాలా మంచోడు.. అని విజయ్ గురించి పూరీ జగన్నాధ్ చెప్పారు.
Also Read: ప్రేక్షకులు దేవుళ్ళే.! కుప్పిగంతులేస్తే, తాట తీస్తారు సుమీ.!
ఈ సినిమాతో ఇండియన్ సినిమాకి మరో పాన్ ఇండియా సూపర్ స్టార్ దొరికాడని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసిన పూరి జగన్నాథ్, ఆ స్థాయి విజయాన్ని ‘లైగర్’ సినిమాతో నమోదు చేస్తాడా.?
జస్ట్ వెయిట్ అండ్ సీ.. మరికొద్ది గంటల్లోనే ‘లైగర్’ అసలు రిజల్ట్ ఏంటో తెలిసిపోనుంది.!