Liger Trailer.. లైగర్ ట్రైలర్ వచ్చేసింది. మామూలుగా కాదు, హై ఆక్టేన్ అనే స్థాయిలో.! పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘లైగర్’ సినిమా తెరకెక్కింది.
సాధారణంగా పూరి జగన్నాథ్ సినిమాలంటే, అందులో డైలాగులకు ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది. కానీ, ‘లైగర్’ ట్రైలర్ విషయంలో ‘మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్..’ అన్నట్టుగా వ్యవహరించారు.
ఔను, మాటల్ని చాలా చాలా తక్కువగా వాడారు ‘లైగర్’ ట్రైలర్ (Liger Movie) విషయంలో.
Liger Trailer వేరే లెవల్.!
ఒక్కమాటలో చెప్పాలంటే, ట్రైలర్‌ని యాక్షన్‌తో కూడిన సాంగ్ తరహాలో కట్ చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. వాట్ యాన్ యాక్షన్.! మైండ్ బ్లోయింగ్ కొరియోగ్రఫీ అంతే.!
పూరి సినిమాల్లో షరామామూలుగా వుండే హీరో హీరోయిన్ల రొమాంటిక్ ట్రాక్ ఇందులోనూ వుంది. అనన్య, విజయ్ ఆ ట్రాక్‌ని ‘అంతకు మించి’ అనే స్థాయిలో పండించినట్లే కనిపిస్తోంది.
హీరో తల్లి పాత్రలో రమ్యకృష్ణ.. పూరి సినిమాల్లో వుండే సగటు తల్లిలానే కనిపిస్తోంది. విలన్ అనుకోవాలో, ఇంకేమైనా అనుకోవాలో.. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ అప్పీయరెన్స్ మాత్రం అదిరిపోయింది.
నేనెవర్ని.! మైక్ టైసన్ ప్రశ్న.!
‘నేను ఫైటర్..’ అంటూ చాలా చాలా కష్టపడి విజయ్ దేవరకొండ. ‘నువ్వు ఫైటర్ అయితే, నేనేంటి.?’ అన్నట్లుగా ప్రశ్నిస్తాడు మైక్ టైసన్. ఈ ట్రైలర్ మొత్తానికీ అదే హైలైట్.

వంద డైలాగులు ఇచ్చే ఇంపాక్ట్ కాస్త, మైక్ టైసన్ చెప్పిన, ‘బట్ వాట్ యామ్ ఐ’ డైలాగ్ ఇచ్చేసిందనడం అతిశయోక్తి కాదు. అందుకే, మాటల్లేవ్.. మాట్లాడుకోడాల్లేవ్ అనేది.!
Also Read: రాధికా ఆప్టే భర్త ‘వేస్టు’ అట.! ‘కో-ఆపరేట్’ చెయ్యడట.!
సినిమాటోగ్రఫీ టాప్ క్లాస్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్టంట్ కొరియోగ్రఫీ.. వాట్ నాట్.. అన్నీ హాలీవుడ్ రేంజ్‌లో వున్నాయ్.!
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి విజయ్ దేవరకొండ పూర్తి న్యాయం చేసినట్లే వున్నాడు తనవంతుగా.
కండలు తిరిగిన దేహం మాత్రమే కాదు, శరీరాన్ని స్ట్రెచ్ చేసిన వైనం.. జస్ట్ మైండ్ బ్లోయింగ్ అంతే.! యావత్ భారతీయ సినీ ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేందుకు ‘లైగర్’ వచ్చేస్తున్నాడు.!