Lokesh Kanagaraj Wamiqa Gabbi.. దర్శకుడంటే, తెరపై హీరో హీరోయిన్లతో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయించేవాడు కూడా.! కానీ, ఆ దర్శకుడే ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేస్తే.?
లోకేష్ కనగరాజ్.. పరిచయం కొత్తగా అవసరం లేదు, ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ గురించి. తమిళ దర్శకుడే అయినా, దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
‘లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ – ఎల్‌సీయూ’ అంటూ, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాల గురించి మాట్లాడుకుంటుంటాం.
Lokesh Kanagaraj Wamiqa Gabbi.. హీరోగా మారిన దర్శకుడు లోకేష్ కనగరాజ్..
దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా మారాడు. అరుణ్ మాథేశ్వరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఇది. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ సినిమా కోసం హీరోయిన్‌గా వామిక గబ్బిని ఎంపిక చేశారు. ‘భలే మంచి రోజు’ సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్‌గా పరిచయమైంది వామిక.

తెలుగుతోపాటు తమిళ, మలయాళ, పంజాబీ, హిందీ.. ఇలా చాలా భాషల్లో వామిక సినిమాలు చేసింది. కొన్ని వెబ్ సిరీస్‌లలోనూ నటించింది.
బాలీవుడ్‌లో సంచలన విజయం సాధించిన ‘జబ్ వి మెట్’ సినిమాలో, బాల నటిగా కనిపించి, నటిగా ఆ సినిమాతో మంచి మార్కులే సంపాదించుకుంది వామిక.
యాక్షన్ మూవీ..
లోకేష్ కనగరాజ్ హీరోగా నటిస్తోన్న సినిమాని, లోకేష్ ట్రేడ్ మార్క్ అయిన.. గ్యాంగ్‌స్టర్ కథాంశంతోనే తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమా కోసం లోకేష్ వీరోచితమైన పోరాటాలు చేసేస్తాడట.
Also Read: అతడు, ఆమె.. ఇంకొక ‘డ్యూడ్’.!
వామికకి కూడా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ వుంటాయని అంటున్నారు. లోకేష్ – వామిక ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ఈ సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్.. అనే ప్రచారం జరుగుతోంది.

దర్శకులు హీరోలుగా మారడం కొత్తేమీ కాదు. ఈ తరం దర్శకుల్లోనూ చాలామంది వెండితెరపై వెలిగిపోయేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
