Love Story Naga Chaitanya Sai Pallavi అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. కరోనా నేపథ్యంలో విడుదల విషయమై కొంత జాప్యం జరిగినా.. సినిమా విడుదలయ్యాక సంచలనాలు ఖాయమని చిత్ర దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా, ‘లవ్ స్టోరీ’ సినిమా ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ చూస్తున్నంతసేపూ ‘ఫిదా’ (వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్‌లో శేఖర్ కమ్ముల రూపొందించిన సినిమా) గుర్తుకురావడం ఖాయం. తెలంగాణ స్లాంగ్ ఈ ‘లవ్ స్టోరీ’ సినిమాలోనూ కనిపించింది. హీరో నాగ చైతన్య నోట తెలంగాణ స్లాంగ్ కాస్త కొత్తగా అనిపించింది. సాయి పల్లవి ఆల్రెడీ ‘ఫిదా’లో ఆ స్లాంగ్ అదరగొట్టేసింది గనుక.. ఈ సినిమాకొచ్చేసరికి మరింత అలవాటైపోయిందనిపిస్తుందంతే.
డైలాగ్స్, సినిమాటోగ్రఫీ, నేపథ్య సంగీతం.. అన్నీ పక్కాగా కుదిరినట్టే వున్నాయి. సాయి పల్లవి డాన్సుల గురించి కొత్తగా చెప్పేదేముంది.? ఆమెకు ధీటుగా నాగచైతన్య కూడా డాన్సులేసినట్టే కనిపిస్తోంది. వీళ్ళిద్దరి ప్రేమకి పెద్దలు అడ్డు తగిలే క్రమంలో ఆ అడ్డంకుల్ని ఎలా అధిగమిస్తారు.? అన్నది తెరపై చూడాల్సిందే.
Also Read: సాయిపల్లవి ‘సారంగ దరియా’ లవ్లీగా వుందిగానీ.!
యువత ఆశల్ని, ఆశయాల్ని అత్యంత అందంగా తెరకెక్కించడంలో శేఖర్ కమ్ముల స్పెషలిస్ట్. ఎమోషన్స్ పండించడంలోనూ ఆయన దిట్ట. ఆరోగ్యకరమైన హాస్యం.. అందమైన రొమాన్స్.. హృదయాల్ని కదిలించే ఎమోషనల్ సీన్స్.. ఇవన్నీ సినిమాలో చాలానే వున్నాయని అనిపిస్తోంది ట్రైలర్ చూస్తోంటే.
నాగ చైతన్య వరకూ చూసుకుంటే ఇదొక ఫ్రెష్ ‘లవ్ స్టోరీ’ అన్నట్టుగానే కనిపిస్తోంది. లుక్ దగ్గర్నుంచి, తెలంగాణ స్లాంగ్.. ఇలా అన్నీ ప్రత్యేకంగా వున్నాయి నాగచైతన్య పాత్ర విషయంలో. శేఖర్ కమ్ముల మార్క్ ప్రతి ఫ్రేమ్‌లోనూ కనిపిస్తోంది. ట్రైలర్ దాదాపుగా సినిమాలో అసలు కోణాన్ని చెప్పకనే చెప్పేసింది.
Also Read: Love Story.. ఏవో ఏవో కలలే.. మళ్ళీ మళ్ళీ ఫిదా అవ్వాలిలే.!
ఇదిలా వుంటే, ‘సారంగదరియా..’ సహా పలు పాటలు ‘లవ్ స్టోరీ’ నుంచి ఇప్పటికే విడుదలై సంచలన విజయాల్ని అందుకున్న సంగతి తెల్సిందే.