Madharasi Telugu Review.. శివకార్తికేయన్, రుక్మిణి వసంత్ కాంబినేషన్‌లో దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన సినిమా ‘మదరాసి’.
బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ ఈ ‘మదరాసి’ సినిమాలో నెగెటివ్ రోల్ చేశాడు.
అంతకు ముందు విజయ్ – మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘తుపాకీ’ సినిమాలోనూ విద్యుత్ జమ్వాల్ నటించిన సంగతి తెలిసిందే.
మురుగదాస్ సినిమాలంటే, యాక్షన్‌కి ఏ స్థాయి ప్రాధాన్యత ఇస్తాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
తమిళనాడులో గన్ కల్చర్‌ని పెంచాలనే కుట్ర పన్నే మాఫియా నేపథ్యంలో ఈ ‘మదరాసి’ సినిమా తెరకెక్కింది.
ఆ గన్ కల్చర్‌ని తమిళనాడులోకి రాకుండా చేయడానికి ప్రయత్నించే పోలీస్ అధికారి ప్రేమంత్ (బిజూ మీనన్).
మానసిక స్థితి సరిగ్గా లేని ఓ వ్యక్తి రఘు (శివ కార్తికేయన్) సాయంతో ప్రేమంత్ ఆ ముఠాని ఎలా అడ్డుకున్నాడన్నదే అసలు కథ.
Madharasi Telugu Review.. ‘మదరాసి’ ఏంటి మురుగదాస్ ఇదంతా.?
సినిమాలో నాలుగు ప్రధాన పాత్రలున్నాయ్. ఒకటి హీరో, ఇంకోటి హీరోయిన్. మరొకటి విలన్, నాలుగోది పోలీస్ అధికారి.! ఈ నాలుగు పాత్రల చుట్టూనే కథ తిరుగుతుంటుంది.
చిన్నప్పుడే తల్లిదండ్రుల్నీ, కుటుంబ సభ్యుల్నీ ఓ ప్రమాదంలో కోల్పోతాడు రఘు. ఆ ఘటనతో, రఘు మానసిక స్థిరత్వాన్ని కోల్పోతాడు. అతనికి వైద్య చికిత్స అందిస్తుంటారు.
కాస్త కోలుకున్నాక, సాధారణ జీవితం గడిపేందుకు వైద్యులు అతనికి అనుమతిస్తారు. అదే సమయంలో, అతనికి మాలతి (రుక్మిణి వసంత్0 పరిచయమవుతుంది.
కష్టాల్లో ఎవరున్నా, వారు తన కుటుంబ సభ్యులేనని భావిస్తాడు రఘు. తన రాకతో రఘు పూర్తిగా మారిపోయాడనీ, దాని వల్ల ఇతరులకు అతను సాయ పడలేకపోతున్నాడనీ మాలతి భావిస్తుంది.

అలా రఘుకి దూరమవుతుంది మాలతి. అక్కడి నుంచి, రఘులో మళ్ళీ మానసిక సమస్యలొస్తాయ్. ఆత్మ హత్య చేసుకోవాలనుకుంటాడు, పోలీసులకు చిక్కుతాడు.
పోలీసులేమో, ఓ సూసైడ్ ఆపరేషన్ కోసం రఘుని రంగంలోకి దించుతారు.. అనధికారికంగా.
ఈ క్రమంలో మాలతి కూడా, గన్ స్మగ్లింగ్ మాఫియాకి టార్గెట్ అవుతుంది. మాలతిని రక్షించుకోవడం కోసం, రఘు.. ప్రయత్నిస్తాడు.
అయినా, పది మందికి సాయం చేసేవాడికి అండగా వుండాల్సిన హీరోయిన్, హీరోకి దూరమవడమే నాన్సెన్స్. దీన్ని జస్టిఫై చేసుకోవడానికి మురుగదాస్ చూపించిన కారణం సిల్లీగా వుంటుంది.
ఇక, పోలీస్ ఉన్నతాధికారి.. మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తికి, పెద్ద ఆపరేషన్ బాధ్యతలు అప్పగించడం.. ఇంకా పెద్ద నాన్సెన్స్.
యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రం బాగా డిజైన్ చేశారు. విద్యుత్ జమ్వాల్‌తో నానా రకాల జిమ్నాస్టిక్స్ చేయించేశారు. హీరో కూడా, ఆ స్థాయిలో ఫిట్‌గా వున్నట్లు చూపించి వుంటే కాస్తయినా బావుండేదేమో.
Also Read: విడిపోయాక కూడా ఆగని ‘నాన్సెన్స్’.!
ఎవరెలా చేశారు.? అనుకోవడానికి ఏమీ లేదు ఇందులో. నటీనటులు అందరూ టాలెంటెడ్. కానీ, ఎవర్నీ వాడాల్సిన స్థాయిలో వాడుకోలేకపోయాడు దర్శకుడు మురుగదాస్.
టెక్నికల్‌గా చూసుకుంటే, సినిమాటోగ్రఫీ.. మ్యూజిక్.. ఇవన్నీ ఫర్లేదు. ఎడిటింగ్ గురించి మాట్లాడుకోవాలంటే, చాలా సీన్స్‌ని నిర్దాక్షిణ్యంగా లేపేసి వుంటే, నిడివి తగ్గి.. ప్రశాంతంగా వుండేదేమో.
తమిళ సినిమాలు, జనాల్ని ఎడ్యుకేట్ చేస్తాయంటూ మురుగదాస్ ఓ స్టేట్మెంట్ ఆ మధ్య పాస్ చేశాడు. ‘మదరాసి’తో ఆయన జనాల్ని ఏం ఎడ్యుకేట్ చేద్దామనుకున్నాడో ఏమో.. ఎవరికీ అర్థం కాలేదు.
థియేటర్లలో సినిమాని భరించడం కష్టం.! ఎందుకంటే, ఓటీటీలో కూడా దీన్ని చాలా చాలా కష్టంగానే భరించాల్సి వచ్చింది కాబట్టి.!
స్టార్ కాస్టింగ్.. బడ్జెట్.. ఇలా అన్నీ వృధా అయ్యాయి.. మురుగదాస్ అడ్డగోలు కథ, కథనాల కారణంగా.
