Table of Contents
తన తండ్రి నుండి సినీ వారసత్వం (Truth Behind Back Stab of NTR) అందిపుచ్చుకున్న నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఈ ఏడాది వరుసగా రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. పేరుకు రెండు సినిమాలే అయినా, కథ ఒక్కటే. ఒకే కథని రెండు భాగాలుగా చేసి తన తండ్రి రుణం తీర్చుకున్నారు బాలకృష్ణ.
Evaru Emanukunna, Enthala Rajakeeya Vimarshalu Vachina, Nandamuri Balakrishna Thaanu Namminde Teesaru. Thana tandri runam teerchukovadam ane pedda maatalu vadalem ganee, tallidandrula madhya premabhimanalni kumarudu ok cinema dwara prapanchaniki chaati cheppalanukovadam abhinandaneeyame.
స్వర్గీయ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) పేరు తెలియని తెలుగువాడుండడు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. సినీ, రాజకీయ రంగాల్లో ఆయన సాధించిన పేరు ప్రఖ్యాతలు అనంతం.
శిఖరం అంచున తారక రాముడు
సినిమా రంగం నుండి మాట్లాడినా, రాజకీయ రంగం నుండి మాట్లాడినా, శిఖరం అంచున స్వర్గీయ ఎన్టీఆర్ (NTR) పేరు తెలుగునాట నిలబడుతుంది. అంతటి మహనీయుడి జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కించాల్సి వస్తే, దాన్ని ఏ కొడుకైనా బాధ్యతగానే భావిస్తాడు. అంతటి బరువును మోయడం కష్ట సాధ్యమే అయినా ఇష్టంగా తన బాధ్యతను నిర్వర్తిస్తాడు.
నందమూరి బాలకృష్ణ (Balakrishna) చేసింది అదే. సినిమాలో ఇది ఉంటే బాగుండేది. అది ఉంటే బాగుండేది.. ఇలా చేస్తే ఫలితం ఇంకోలా ఉండేదేమో వంటి అంశాల చుట్టూ చర్చోపచర్చలు జరగొచ్చు కాక.
కానీ ఇది నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆలోచనల్లోంచి పుట్టినది. తల్లిని, తండ్రినీ అమితంగా ప్రేమించే ఓ కొడుకు తన తల్లి తండ్రుల మధ్య ప్రేమానుబంధాన్ని వెండితెరకెక్కించి మురిసిపోదామనుకున్నాడు. అదే చేశాడు కూడా. మురిసిపోయాడు కూడా.
అన్న ఎన్టీఆర్ అంటే అంతటి అపారమైన గౌరవం (Truth Behind Back Stab Of NTR)
స్వర్గీయ ఎన్టీఆర్‌ని అభిమానించేవారు చివరి రోజుల్లో ఎన్టీఆర్ పడ్డ మానసిక క్షోభని తలచుకుని బాధపడతారే తప్ప, ఆ ఆవేదనను ఇంకోసారి తెరపై చూడాలని అనుకోరు. అతనిపై ఉన్న అపారమైన గౌరవం కారణంగానే అలా భావిస్తారు. కొందరికి మాత్రం ఎన్టీఆర్ జీవిత చరమాంకంలో పడ్డ ఆవేదన మాత్రమే కనిపించొచ్చు కాక. వారిని తప్పు పట్టలేం. అది వారి వివేకం. వారి ఇష్టం.
ఇక్కడ బాలకృష్ణ కోణంలో మాత్రమే ఎన్టీఆర్ బయోపిక్‌ని (NTR Biopic) చూడాలి. తెరపై తారకరాముడు బసవతారకంతో పంచుకున్న ఎన్నో మధురానుభూతులు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి. తెరపై ఎన్టీఆర్‌ని చూశాం. తెర వెనుక భర్త పాత్రలో ఎన్టీఆర్ ఎలా తన భార్యను ప్రేమించారో తెలుసుకుంటే, అదొక ప్రత్యేకమైన అనుభూతి.
తొలి భాగం ‘కథానాయకుడు’ (NTR Kathanayakudu) గా ఎన్టీఆర్ ఎదిగిన వైనం మీదనే కేంద్రీకృతమైంది. రెండో భాగం ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ (NTR Mahanayakudu) గా ఎదిగిన వైనంతో నిండిపోయింది.
డబ్బు కోసం సినిమా తీయలేదు.. (Truth Behind Back Stab Of NTR)
‘డబ్బు కోసం నేనీ సినిమా తీయలేదు. అమ్మానాన్నల్ని తెరపై చూసుకోవాలనుకున్నాను. మమ్మల్ని అభిమానించే మా అభిమానులకు చూపిద్దామనుకున్నాను. స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానుల కోసం తీసిన సినిమా ఇది (Truth Behind Back Stab Of NTR). ఆయన్ని అభిమానించేవారు అంటే తెలుగు రాష్ట్రాల్లో కోట్లాదిమంది ఉన్నారు. ప్రపంచ దేశాల్లోనూ స్వర్గీయ ఎన్టీఆర్ అభిమానులున్నారు. జయాపజయాలతో సంబంధం లేని సినిమా ఇది. కాబట్టి ఇతరత్రా విషయాల గురించి ఆలోచించను..’ అని బాలకృష్ణ (Balakrishna) ఇప్పటికే చెప్పి ఉన్నారు.
అవును ఇది నిజం. ఇదే నిజం. ఎందుకంటే రెండున్నర గంటల నిడివితోనో, ఐదు గంటల నిడివితోనో పూర్తయిపోయే కథ కాదిది. ఇది ఎన్టీఆర్ జీవితం. ఎన్టీఆర్ తనయుడు (Balayya) తన తండ్రిని చూపించాలనుకున్న వైనం. ఆ ప్రేమాభిమానాలకు ఉండదు కొలమానం.
కథా నాయకుడు – మహా నాయకుడు
నవ్వే వాళ్లు నవ్వనీ.. ఏడ్చేవాళ్లు ఏడ్వనీ.. డోంట్ కేర్. ఎందుకంటే స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) అసలు సిసలు ‘కథానాయకుడు’. అంతకుమించి ‘మహానాయకుడు’.! (Truth Behind Back Stab Of NTR)