బిగ్‌బాస్ రియాల్టీలో కొన్ని గొడవలు చాలా సిల్లీగా వుంటుంటాయ్. ‘ఒరేయ్..’ అని ఒకర్నొకరు పిలుచుకోవడం మామూలే. ఆడా.. మగా.. అన్న తేడాల్లేవిక్కడ. బిగ్ బాస్ టైటిల్ (Bigg Boss 3 Telugu) గెలవడానికి వచ్చాం తప్ప, రిలేషన్స్ కోసం (Varun Sandesh And Mahesh Vitta) కాదంటారు.. అంతలోనే, బంధాలు.. అనుబంధాలంటూ ఊగిపోతుంటారు.
గత సీజన్‌లో కౌశల్ మండా, హౌస్‌లో మిగతా సభ్యులందరి దృష్టిలో విలన్ అయినాగానీ, జనం దృష్టిలో హీరో అయ్యాడు. ఇప్పుడు, బిగ్ హౌస్‌లో (Bigg Boss Telugu 3) అదే పరిస్థితిని మహేష్ విట్టా ఎదుర్కొంటున్నాడు. చిన్న పిల్లల టాస్క్‌ని బిగ్ బాస్ ఇస్తే.. అంతా పిచ్చోళ్ళలా వెకిలి వేషాలు వేశారు. ‘అలా నేను చేయలేను.. చిన్న పిల్లలంటే చిల్లర వేషాలు వేయడమా.?’ అని మహేష్ విట్టా స్ట్రెయిట్‌గా వున్న మాట చెబితే, చాలామందికి కోపమొచ్చింది.
రాయలసీమ స్లాంగ్‌లో ‘పో’ అన్న మాట ఓ మహిళ (వితికా షెరు Vithika Sheru) మీద వాడటమే మహేష్ చేసిన పెద్ద నేరం అయిపోయింది. ‘నా పెళ్ళాన్ని అంత మాట అంటావా.?’ అని వరుణ్ సందేశ్ రెచ్చిపోవడం చూస్తే, ఎవరికైనా షాక్ తగలక మానదు. గొడవని కంటిన్యూ చేసే ఉద్దేశ్యంతో, వరుణ్ సందేశ్, మేగ్జిమమ్ స్క్రీన్ టైమ్‌ని లాగేసుకున్నాడు. డిస్‌గస్టింగ్ ఆటిట్యూడ్ ప్రదర్శించి, అర్థం పర్థం కాకుండా ఏవేవో మాట్లాడేశాడు.
మహేష్ (Mahesh Vitta) మాత్రం, మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పేందుకు సిద్ధమయ్యాడు. కానీ, వరుణ్ ఒప్పుకోలేదు. ‘బ్రో..’ అని వరుణ్‌ని (Varun Sandesh) ఉద్దేశించి మహేష్ అంటే, ‘ఎవరికి బ్రదర్.. వరుణ్ అంటే చాలు..’ అని విసుక్కున్నాడు. ‘నాకు చెల్లెలు లాంటిది వితిక..’ అని మహేష్ విట్టా చెప్పినా, వరుణ్ పట్టించుకోలేదు. వితిక కూడా, మహేష్ వివరణని (Varun Vithika) వినే పరిస్థితుల్లో లేకపోవడం (Vithika Varun) గమనార్హం.
చివరికి, మళ్ళీ మహేష్ విట్టా.. (Mahesh Vitta) తనవంతుగా క్షమాపణ చెప్పేందుకు ప్రయత్నించాడు. ఏదో మొహమాటంగా వరుణ్, ‘సరే’ అని అన్నాడుగానీ, ఈ క్రమంలో వరుణ్, మహేష్ విట్టాని విదిలించుకున్న తీరు మాత్రం ఆక్షేపణీయం. చూస్తోంటే, ఇదేదో పక్కా ‘ఫ్యాబ్రికేటెడ్’ వ్యవహారంలాగా అన్పించకమానదు.
ఫ్యాబ్రికేటెడ్ అయితే ఫర్లేదు.. లేకపోతే, వరుణ్ సందేశ్ తన ఇమేజ్ పాడుచేసుకుంటాడా.? మహేష్ విట్టా, తన ఆత్మగౌరవం దెబ్బ తింటున్నా.. భరిస్తాడా.? అవకాశమే లేదు. ఏదిఏమైనా బిగ్ బాస్ రియాల్టీ షో అనేది, జస్ట్ ఓ టెలివిజన్ ప్రోగ్రామ్. ఇందులో జరిగేది అంతా వాస్తవమేనని అనుకోవడానికి వీల్లేదు. అనుకుంటే మాత్రం, ఖచ్చితంగా మానవ సంబంధాలు చెడిపోతాయ్.
అంత దారుణంగా బిగ్ హౌస్‌లో (Bigg Boss Telugu Season 3) సభ్యుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనిపోతోంది. చపాతీ ముక్క కోసం గొడవ.. వంట చేయడం గురించి తగాదా. ఇలా కొట్టుకోవడం కోసమే ఈ రియాల్టీ షోలో కంటెస్టెంట్స్‌గా వెళుతున్నారని సెలబ్రిటీల గురించి ఎలా అనుకోగలం.?
ఏదిఏమైనా, ఈ వీక్ ది బెస్ట్ కంటెస్టెంట్ ఎవరంటే మాత్రం మహేష్ విట్టా అని నిస్సందేహంగా చెప్పొచ్చు. అంతలా అతను సంయమనంతో వ్యవహరించాడు. కోపాన్ని అదుపు చేసుకున్నాడు. దురదృష్టం, అతన్ని హౌస్‌లో అందరూ ‘విలన్’గా చూస్తున్నారు. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడు కాదనే సూక్తి మహేష్ విట్టాకి వర్తిస్తుందా? వేచి చూడాలిక.