Maheshbabu Bollywood.. మన తెలుగు సినిమాలు జాతీయ స్థాయిలో సత్తా చాటాలని కోరుకున్నాను.. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలు ఆ కోరిక తీర్చాయి.. అంటున్నాడు సూపర్ స్టార్ మహేష్‌బాబు.
తన తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలో.. పాన్ ఇండియా స్థాయిలో వుంటుందని మహేష్ చెప్పాడు. మహేష్ చెప్పినా, చెప్పకపోయినా.. అది రాజమౌళి (SS Rajamouli) ప్రాజెక్టు గనుక, పాన్ ఇండియా సినిమానే.. ఇందులో డౌటేముంది.?
ఇంతకీ, బాలీవుడ్ సినిమా ఎప్పుడు.? అన్న ప్రశ్నకు మహేష్‌బాబు పరమ రొటీన్ సమాధానమిచ్చాడు.
Maheshbabu Bollywood.. బాలీవుడ్ భరించలేదన్న సూపర్ స్టార్.!
‘బాలీవుడ్ సినీ పరిశ్రమ నన్ను భరించలేదు. బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయిగానీ, నేనే వాటిని ఒప్పుకోవడంలేదు’ అని సూపర్ స్టార్ చెప్పాడు.
‘నాకు తెలుగు సినిమాలంటేనే ఇష్టం. తెలుగు సినిమాలే చేస్తాను. అవి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకోవాలని కోరుకుంటాను. హిందీ సినీ పరిశ్రమే కాదు, తమిళ, కన్నడ, మలయాళ.. ఇలా అన్ని సినీ పరిశ్రమల పట్ల నాకు మంచి గౌరవం వుంది..’ అని క్లారిటీ ఇచ్చాడు మహేష్‌బాబు.

గతంలో ఓ బాలీవుడ్ నటుడు, తాను హిందీ నటుడిననీ, డబ్బు కోసం ఇతర భాషల్లో చిన్నా చితకా వేషాలు వేసే స్థాయికి దిగజారిపోననీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.
కానీ, మహేష్ (Super Star Maheshbabu) హుందాతనమే వేరు. ఆ మాటకొస్తే, సౌత్ హీరోలకి బాలీవుడ్ పట్ల వున్న గౌరవ భావం చాలా చాలా ప్రత్యేకం.
Also Read: ‘లిప్ లాక్’ చేసేశావ్.! ‘ఆ..’ పబ్లిసిటీ వచ్చిందా రామకృష్ణా.?
ఒకప్పుడు సౌత్ సినిమాని నార్త్ బెల్ట్ చాలా చిన్న చూపు చూసేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అలాగని బాలీవుడ్ సినిమాని తక్కువ చేసి చూడలేం. దేనికదే ప్రత్యేకం.
‘స్పైడర్’ (Spyder Telugu Movie) సినిమా కోసం చెన్నయ్‌లోనూ మహేష్ ప్రచార కార్యక్రమాలు చేపట్టాల్సి వచ్చింది.
‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) సినిమాని తమిళ ప్రేక్షకులకు చేరువ చేసేందుకోసం కేవలం సబ్ టైటిల్స్‌తో మాత్రమే విడుదల చేస్తున్నారక్కడ.