Table of Contents
Major Movie First Review.. తెలిసిన కథే ఇది. గుండెలు పిండేసే కథ.! అదే సమయంలో, సగటు భారతీయుడి ఛాతీ దేశ భక్తితో ఉప్పొంగే కథ.
మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్.. దేశ ఆర్థిక రాజధానిపై పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు జరిపిన దాడిని ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన అనేక మంది సాహస వీరుల్లో ఆయనా ఒకరు.
నరరూప రాక్షసుల్ని అంతమొందించి, ఈ క్రమంలో తమ ప్రాణాల్ని పణంగా పెట్టిన అధికారుల్లో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వున్నారు. ఆయన బయోగ్రఫీగా ‘మేజర్’ సినిమా తెరకెక్కింది.
ముష్కరమూక దండెత్తిందిలా.!
పడవల్లో సముద్ర మార్గాన దేశ ఆర్థిక రాజధానిలోకి ఎలా ముష్కరులు అడుగు పెట్టారు.? వారు సృష్టించిన మారణహోమమేంటి.? వారిని మన భద్రతా బలగాలు ఎలా అడ్డుకున్నాయి.? వంటివన్నీ మనం దాదాపుగా లైవ్‌లోనే చూసేశాం చాలాకాలం క్రితం.

అయితే, మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథని మనం ఈ సినిమాలో అదనంగా చూడబోతున్నాం. లవ్ ట్రాక్ కూడా ఈ సినిమాలో పొందుపర్చడం విశేషం.
ఇంతకీ, సినిమా ఎలా వుంది.? ప్రీమియర్ షో తర్వాత, ఆడియన్స్ టాక్ ఎలా వుంది.? వంటి వివరాల్లోకి వెళితే, ప్రీమియర్ షోల నుంచి యునానిమస్ హిట్ టాక్ లభిస్తోందని చెప్పక తప్పదు.
నిజానికి, ‘సినిమా బాగా లేదు’ అని ఇలాంటి సినిమాలకు చెప్పడానికి ఎవరికీ ఇష్టం వుండదు.
Major Movie First Review.. ఓ అమరవీరుడి కథ.!
కారణం అందరికీ తెలిసిందే.. ఇది దేశభక్తిని పెంచే కథ. ఓ అమరవీరుడి కథ. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ గురించి తెలుసుకోవాలని కోరుకోని భారతీయుడు వుంటాడా.?
ఛాన్సే లేదు. సో, సినిమా చూస్తున్నంతసేపూ, ఆయన గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత ప్రేక్షకుల్లో కలుగుతుంది.
ఈ విషయంలో దర్శకుడు, ప్రేక్షకుల్ని తన కథలోకి బాగానే తీసుకెళ్ళాడు. మన కళ్ళ ముందు ఆనాడు జరిగిన ఘటనలన్నీ ఇంకోసారి తెరపై కనిపిస్తుంటాయి. అయితే, కొంత డ్రమెటిక్‌గా.. ఇంకాస్త లౌడ్‌గా.. అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్.
బాగా లేదని ఎలా అనగలం.?
నటుడిగా అడివి శేష్‌కి వంక పెట్టలేం. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో ఒదిగిపోయాడు.
హీరోయిన్ సాయీ మంజ్రేకర్ ఓకే. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధి మేర బాగానే చేశారు. రియల్ హీరో సందీప్ ఉన్నికృష్ణన్ కావడంతో, ఆ పాత్ర నుంచి ఇంకాస్త ఎక్కువ ఆశిస్తాం.! అలా ఆశిస్తే, కాస్త నిరాశ చెందుతాం.
Also Read: పాన్ ఇండియా పైత్యమా.! గౌరవం కాదు, అవమానమా.!
నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తలు తీసుకుని వుంటే బావుండేది. ఓవరాల్‌గా ‘మేజర్’ మాత్రం మంచి విజయాన్ని అందుకునే అవకాశాలున్నాయి.
చివరగా.. ఇది ప్రీమియర్ టాక్ మరియు ఫస్ట్ రివ్యూ మాత్రమే.. ఫైనల్ రివ్యూ కాస్సేపట్లో..