Malavika Mohanan Chiranjeevi Gossip.. మెగాస్టార్ చిరంజీవి, కె.ఎస్. రవీంద్ర అలియాస్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.
గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ ఏ స్థాయి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తే, రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించాడు. మరోమారు చిరంజీవి – రవితేజ కాంబినేషన్‌లో సినిమా చేస్తానని బాబీ అప్పట్లోనే ప్రకటించాడు.
అయితే, ఈసారి రవితేజ లేకుండా చిరంజీవితోనే, బాబీ ఓ సినిమాని తెరకెక్కించబోతున్నాడు. తాజాగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా మాళవిక మోహనన్ నటిస్తోందన్న ప్రచారం జరిగింది.
Malavika Mohanan Chiranjeevi Gossip.. రాజా సాబ్.. మాత్రమే.!
ప్రస్తుతం ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తోంది మాళవిక మోహనన్. తెలుగులోకి ‘హీరో’ సినిమాతో తెరంగేట్రం చేయాల్సి వుంది మాళవిక మోహనన్.
విజయ్ దేవరకొండ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ ఈ ‘హీరో’ సినిమాని ప్రారంభించింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు అర్థాంతరంగా నిలిచిపోయింది.

ఇక, చిరంజీవి – బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కే సినిమాలో హీరోయిన్.. అంటూ వస్తున్న వార్తలపై మాళవిక స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
తాను, ఈ ప్రాజెక్టులో నటించడం లేదనీ, అలాంటి ప్రతిపాదన ఏదీ తన దగ్గరకు రాలేదనీ, అయితే చిరంజీవితో నటించాలన్న కోరిక మాత్రం తనకు బలంగా వుందనీ మాళవిక మోహనన్ చెప్పుకొచ్చింది.
మాళవిక కాకపోతే, చిరంజీవి సరసన బాబీ సినిమాలో నటించబోయే హీరోయిన్ ఎవరు.? ఈ విషయమై త్వరలోనే ఓ స్పష్టత వచ్చే అవకాశముంది.

చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా పనుల్లో బిజీగా వున్న సంగతి తెలిసిందే. నయనతార ఈ సినిమాలో హీరోయిన్. అనిల్ రావిపూడి దర్శకుడు.
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమా వచ్చే వేసవిలో విడుదల కానుంది. త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది ‘విశ్వంభర’ సినిమాలో.
