Malavika Mohanan Nayanthara catfight.. నయన తారని ‘తోక’ అంటావా.? ‘లేడీ సూపర్ స్టార్’ అని నయనతారని పిలిస్తే, నీకొచ్చిన నష్టమేంటి.?
నటి మాళవిక మోహనన్ అనవసరంగా వివాదాన్ని కొనితెచ్చుకుంది.
కొన్నాళ్ళ క్రితం ‘లిప్ స్టిక్ వేసుకుని ఎవరైనా హాస్పిటల్ సీన్ చేస్తారా.? సూపర్ స్టార్ అని పిలవబడుతున్న సీనియర్ హీరోయిన్‌కి ఆ మాత్రం తెలియదా.?’ అంటూ మాళవిక మోహనన్ ప్రశ్నించింది.
ఆ ప్రశ్న నేరుగా నయనతారకే.! దాంతో, నయనతార గుస్సా అయ్యింది. నేరుగా, మాళవిక మోహనన్ పేరు ప్రస్తావించలేదు.
కానీ, ‘దర్శకుడు ఏం చెబితే అది నేను చెయ్యాలి.. ఆ క్షణం నేను ఏం చేశానో దానిపై నాకు అవగాహన వుంది..’ అంటూ వివరణ ఇచ్చింది.
Malavika Mohanan Nayanthara catfight పబ్లిసిటీ పైత్యం ఎవరిది.?
‘నా పేరు చెప్పి పబ్లిసిటీ పొందాలనుకునేవారిని నేను నిలువరించలేను కదా.? నన్ను విమర్శిస్తే పాపులారిటీ వస్తుందని కొందరు అనుకుంటుంటారు..’ అని మాళవికపై నయనతార తనదైన స్టయిల్లో కౌంటర్ ఎటాక్ చేసింది.

తాజాగా, ‘నయనతారని లేడీ సూపర్ స్టార్ అని పిలవడం నాకు నచ్చదు..’ అంటూ మాళవిక ఇంకోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.
‘నీకు నచ్చితే ఎవడిక్కావాలి.? నచ్చకపోతే ఎవడిక్కావాలి.?’ అంటూ మాళవికపై నయనతార అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
క్షమాపణ చెప్పినట్టే చెప్పి..
చేసేది లేక, తన తాజా సినిమా ప్రమోషన్ సందర్భంగా మీడియా ముందుకొచ్చినప్పుడు, ‘సూపర్ స్టార్ అని పిలవండి.. మళ్ళీ ఇక్కడ లేడీ సూపర్ స్టార్ ఎందుకు.?’ అంటూ కొత్త వివాదానికి తెరలేపింది.

అంతేనా, ‘లింగ బేధం చూపించకూడదన్నదే నా ఉద్దేశ్యం. నయనతారనో, మరొకరినో అవమానించడం నా ఉద్దేశ్యం కాదు..’ అని మాళవిక కవర్ డ్రైవ్ చేసేందుకు ప్రయత్నించింది.
Also Read: నా భర్త విడాకులకి నేను కారణం కాదు: ఈ కెలుకుడేల హన్సిక.?
బాలీవుడ్‌లో దీపికా పడుకొనే, కంగనా రనౌత్, ప్రియాంక చోప్రా తదితరులున్నారు.. వారెవరికీ ఇలా ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలిపించుకోవాలని లేదు.. అని మాళవిక అంటోంది.
అసలు మాళవిక – నయనతార మధ్య గొడవేంటి.? ఎందుకీ రచ్చ.? ఏమో, ఆ ఇద్దరికే తెలియాలి.