Malavika Mohanan Patlu.. అందం, అభినయం.. అన్నీ వున్నాగానీ, ఫాఫం.. మాళవిక మోహనన్‌కి లక్కు కలిసి రావట్లేదమో.!
అదేంటీ, ఏకంగా ప్రభాస్ సరసన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తోంది కదా.? అంటే, ఆ సినిమా మీద ‘జీరో బజ్’ వుంది మరి.!
తమిళంలో పలు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, తెలుగులో చాలాకాలం క్రితమే ఎంట్రీ ఇవ్వాల్సి వుంది. విజయ్ దేవరకొండ సరసన ‘హీరో’ అనే సినిమాకి కమిట్ అయ్యింది.
Malavika Mohanan Patlu.. తూచ్.. అనేసిందిగానీ..
కానీ, అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. తాజాగా, పవన్ కళ్యాణ్‌తో మాళవిక మోహనన్ ఓ సినిమా చేయబోతోందనే ప్రచారం తెరపైకొచ్చింది.

అయితే, మాళవిక మోహనన్ ఆ ప్రచారాన్ని ఖండించింది. పవన్ కళ్యాణ్‌తో తాను సినిమా చేయడంలేదనీ, భవిష్యత్తులో మాత్రం చేస్తానంటూ చెప్పుకొచ్చింది.
Also Read: Malvika Nair: మనసుకి నచ్చినవి మాత్రమేనట.!
‘ఓజీ’ సినిమా కోసం మాళవికను హీరోయిన్‌గా అనుకుంటున్నారనే ప్రచారం తెరపైకి రావడంతో ఆమె పై విధంగా స్పందించింది.
ఇదిలా వుంటే, ప్రభాస్ – మారుతి కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలో తాను సెకెండ్ హీరోయిన్ కాదనీ, తానే మెయిన్ హీరోయిన్ అనీ మాళవిక స్పష్టతనివ్వడం గమనార్హం.