Malavika Mohanan Tauba.. మ్యూజిక్ వీడియో అంటే, ఒకప్పుడు వాటి కోసం ప్రత్యేకంగా అందాల భామలుండేవారు. ఇప్పుడు సీన్ మారింది. హీరోయిన్లు, మ్యూజిక్ వీడియోలలో నటించడానికి ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
తాజాగా, ఆ లిస్టులోకి చేరింది మాళవిక మోహనన్. తొలిసారిగా తన నుంచి వస్తోన్న ‘తౌబా’ మ్యూజిక్ వీడియో కోసం మాళవిక చాలా ఎక్సయిట్‌మెంట్ ప్రదర్శించింది.
స్వతాహాగా డాన్స్ అంటే మాళవికకి చాలా చాలా ఇష్టమట. ఆ ఇష్టంతోనే ఈ మ్యూజిక్ వీడియో చేశానని మాళవిక మోహనన్ చెప్పుకొచ్చింది.
Malavika Mohanan Tauba.. వ్యూస్ పోటెత్తుతున్నాయ్.!
‘తౌబా’ మ్యూజిక్ వీడియో బయటకు వచ్చింది. వస్తూనే, ఈ వీడియోకి వ్యూస్ పోటెత్తడం మొదలైంది. మరోపక్క, మ్యూజియ్ వీడియో ప్రమోషన్ కోసమా.? అన్నట్టు, అభిమానులతో సోషల్ మీడియా వేదికగా చిట్ చాట్ షురూ చేసింది.
తెలుగులో త్వరలో సినిమా చేయబోతున్నాననీ, షారుక్‌తో కలిసి నటించే అవకాశం రావడం అద్భుతమనీ చాలా విషయాలే చెప్పింది మాళవిక మోహనన్.
నచ్చిన ఫుడ్ ఎలాంటి ఆలోచనా లేకుండా తినేస్తానంటోన్న మాళవిక, ఫిట్‌గా వుండడం కోసం నిత్యం కసరత్తులు చేస్తుంటానని వెల్లడించింది.
తెలుగులో రెండోస్సారి.!
తెలుగులో మాళవిక మోహనన్ గతంలోనే ఓ సినిమా చేయాల్సి వుంది. సినిమా ప్రారంభమయ్యింది కూడా. అదే విజయ్ దేవరకొండతో సినిమా. దానికి ‘హీరో’ అనే టైటిల్ కూడా పెట్టారు.
Also Read: నజ్రియా.! అప్పుడేమో వద్దు.. ఇప్పుడేమో ముద్దు.!
అనివార్య కారణాలతో ఆ సినిమా అప్పట్లో ఆగిపోయింది. మళ్ళీ అది ముందుకు నడిచే అవకాశాలేమీ కనిపించడంలేదనుకోండి.. అది వేరే సంగతి.
‘తౌబా’ మ్యూజిక్ వీడియో విషయానికొస్తే, మాళవిక (Malavika Mohnan) గ్లామర్ ఈ వీడియోకి స్పెషల్ ఎట్రాక్షన్. మాళవిక కాస్ట్యూమ్స్, ఆమె ఎక్స్‌ప్రెషన్స్.. ఆమె డాన్సులు.. వాట్ నాట్.. ఆమె ఓ కంప్లీట్ ప్యాకేజీ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.
బాద్ షా, పాయల్ దేవ్ సంయుక్తంగా ఈ మ్యూజిక్ వీడియో (Tauba Music Video) రూపొందించారు. అన్నట్టు, ఆ మధ్య నేషనల్ క్రష్ రష్మిక మండన్న (Rashmika Mandanna) కూడా ఓ మ్యూజిక్ వీడియోలో కనిపించిన విషయం విదితమే.

మ్యూజిక్ వీడియోలంటే అవేవీ ఆషామాషీగా రూపొందడంలేదండోయ్.! వాటి కోసం బోల్డంత కష్టపడుతున్నారు.
సినిమాల్లో పెద్దయెత్తున ఖర్చు చేసి పాటలు తీయడంతో పోల్చితే, ఆ స్థాయిలోనే మ్యూజిక్ వీడియోస్ కూడా వుంటున్నాయ్. వాటికి అందుకే అంత డిమాండ్.!