Malika Arora Age Number.. బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా తెలుసు కదా.? అదేనండీ, ‘గబ్బర్ సింగ్’ సినిమాలో ‘కెవ్వు కేక..’ అంటూ స్పెషల్ సాంగ్ చేసింది కదా.! ఆ ఐటమ్ బాంబే.!
కేవలం సినీ నటి మాత్రమే కాదు. నిర్మాత కూడా.! అంతకు మించి, మలైకా అరోరా (Malaika Arora) ఎంటర్‌ప్రెన్యూర్ కూడా.!
కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో సుదీర్ఘకాలం వైవాహిక జివితం కొనసాగించిన మలైకా, కొన్నాళ్ళ క్రితమే అతన్నుంచి విడాకులు తీసుకుంది.
మలైకా – అర్భాజ్ ఖాన్ జంటకి ఓ కొడుకున్నాడు.! ప్రస్తుతం తనకంటే వయసులో చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో సహజీవనం చేస్తోంది మలైకా అరోరా.
Malika Arora Age Number.. గ్లామర్.. జస్ట్ గ్లామర్.!
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా హాట్ అండ్ వైల్డ్ ఫొటోల్ని షేర్ చేసే మలైకా అరోరాకి, తరచూ ఎదురయ్యే ప్రశ్న, ‘పాపా నీ వయసెంత.?’ అనే.!
ఐదు పదుల వయసుకి దగ్గర పడింది మలైకా.! కానీ, ఇంకా ఇరవై ఐదేళ్ళ బ్యూటీలానే కనిపిస్తుంటుంది. అదే ఆమె ప్రత్యేకత.

‘నీ అందం వెనుక సీక్రెట్ ఏంటి.? అసలు వయసు కంటే, తక్కువ వయసులో.. అందులోనూ, సగం వయసులో వున్నట్లు కనిపించడానికి కారణమేంటి.?’ అన్న ప్రశ్నలు ఎదురవుతుంటాయి మలైకా అరోరాకి.
Also Read: ‘షో’యగం: వారెవ్వా.! వాణీ కపూర్.!
ఈ ప్రశ్నలు బోర్ కొట్టేస్తున్నాయనీ, ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అనే పరమ రొటీన్ డైలాగ్ పదే పదే చెప్పాల్సి వస్తోందని మలైకా తాజాగా వ్యాఖ్యానించింది.
‘నా వయసుని దాచుకోవాల్సిన అవసరం లేదు. నాకొక కొడుకున్నాడు. నేను విడాకులు తీసుకున్నాను. అర్జున్ కపూర్ నాకు మంచి స్నేహితుడు.. అతని ప్రేమలో మునిగి తేలుతున్నా..’ అని మలైకా చెబుతోంది.
మలైకా అరోరా అసలు వయసు జస్ట్ యాభై ఏళ్ళు మాత్రమే.! మీకర్థమవుతోందా.? హాఫ్ సెంచరీ కొట్టేసినా, క్వార్టర్ సెంచరీ అన్నట్టే తళతళ్ళాడిపోతుంటుంది మలైకా.