పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఓడారా.? గెలిచారా.? ఓడారు, కానీ గెలిచారు. అదేండీ, గెలవడమో.. ఓడటమో.. ఏదో ఒకటే వుంటుందిగానీ, గెలిచి ఓడటమేంటి.? ఔను, మమతా బెనర్జీ ఓడి గెలిచారు. ఎమ్మెల్యేగా గెలవాల్సిన మమతా బెనర్జీ ఓడిపోయారు (Mamata Banerjee Spectacular Win In West Bengal Assembly Elections). కానీ, ఆమె తన పార్టీని గెలిపించారు.
మమతా బెనర్జీ, నందిగ్రామ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం విదితమే. ఇది నిజంగానే అత్యంత సాహసోపేతమైన చర్య. సువేందు అధికారి, ఈ నందిగ్రామ్ నుంచి పోటీ చేశారు, బీజేపీ తరఫున. ఇదే సువేందు అధికారి, ఒకప్పుడు మమతా బెనర్జీ కుడి భుజంలా పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్టీ మారారు.
రాజకీయంగా తనను వెన్నపోటు పొడిచిన, సువేందు అధికారిపై పోటీకి దిగారు మమతా బెనర్జీ. ఓడిపోతానని తెలిసీ, నందిగ్రామ్ నుంచి పోటీ చేయడంతోనే, ఆమె నైతికంగా గెలిచేశారు. ఎలాగైనా మమతని ఓడించాలన్న కసితో అక్కడ బీజేపీ నడిపిన రాజకీయాలు అన్నీ ఇన్నీ కావు.
మొదటి రౌండ్ నుంచీ.. చివరి రౌండ్ ఫలితం వరకూ నరాలు తెగే ఉత్కంఠ కనిపించింది. మమతా బెనర్జీ గెలిచిందన్నారు.. ఇంతలోనే ఓడిందన్నారు. తీవ్ర గందరగోళం నడుమ.. తాను ఓడిపోయినట్లు స్వయంగా మమతా బెనర్జీ ప్రకటించడం గమనార్హం.
200కి పైగా స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచి, అధికారారన్ని నిలబెట్టుకుంది. సో, మమతా బెనర్జీ తిరిగి అసెంబ్లీకి ఎన్నికవడం పెద్ద కష్టమేమీ కాదు. మమతా బెనర్జీ తిరిగి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే. మమతా బెనర్జీకి ముఖ్యమంత్రిగా ఇది హ్యాట్రిక్ విజయం.
కాలు విరగడంతో, వీల్ ఛెయిర్ మీదనే వుంటూ, పశ్చిమబెంగాల్ (Mamata Banerjee Spectacular Win In West Bengal Assembly Elections) ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన మమతా బెనర్జీ, అసలు సిసలు ‘ఐరన్ లేడీ’, ‘రాయల్ బెంగాల్ టైగర్‘ అని ఆమె అభిమానులు అంటున్నారు.