Mamta Mohandas.. ‘ఆకలేస్తే అన్నం పెడతా.. అలిసొస్తే ఆయిల్ పెడతా చిన్నోడా..’ అంటూ పాటతో కెరీర్ ప్రారంభించిన మలయాళ ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్ (Mamta Mohandas) గుర్తుంది కదా.
అఫ్‌కోర్స్.! ఎందుకు గుర్తుండదులెండి. సింగర్‌గా, నటిగా మమతా మోహన్ దాస్ తెచ్చుకున్న గుర్తింపు కంటే, మరో రకంగా తెచ్చుకున్న గుర్తింపే ఎక్కువండోయ్.
అదెలా అంటారా.? ఎప్పటికప్పుడే మమతా మోహన్ దాస్‌ని చంపేస్తుంటారు వార్తల్లో. ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ బారిన పడి ధైర్యంగా ఆ వ్యాధిని ఆమె ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.
Mamta Mohandas.. అలా రెండు సార్లు చంపేశారు
ఆ టైమ్‌లోనే మమతా మోహన్ దాస్‌ని ఒకట్రెండు సార్లు చంపేశారు మీడియా సాక్షిగా. నేను బతికే వున్నాను మొర్రో.! అంటూ వివరణ ఇచ్చుకోవల్సి వచ్చింది మమతా మోహన్ దాస్.
ఆ తర్వాత రెండోసారి కూడా ఆమె క్యాన్సర్ బారిన పడింది. రెండోసారి కూడా అంతకు మించిన ధైర్యంతో ఆ వ్యాధిని ఎదుర్కొంది కానీ, సోషల్ దుష్ర్పచారాల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయింది.
మమతా మోహన్ దాస్ ఇదంతా పబ్లిసిటీ కోసమే చేస్తోందంటూ సోషల్ మీడియా వేదికగా అత్యంత దారుణంగా ట్రోల్ చేశారు కొందరు ఆకతాయిలు.

అందుకే, పాపం అంతలా వివరణ ఇచ్చుకోవల్సి వచ్చేది మీడియా ముందుకొచ్చి. ‘నేను బతికుండడం కొందరికి ఇష్టం లేదేమో.. అందుకే అప్పుడప్పుడూ నన్ను చంపేస్తుంటారు..’ అని ఒకింత హ్యూమరస్‌గా కూడా రెస్పాండ్ అయ్యింది గతంలో మమతా మోహన్ దాస్.
నాకే ఎందుకింత కష్టం.!
తాజాగా తనకు మరో అరుదైన వ్యాధి ఎటాక్ చేసిందంటూ ఇన్‌స్టా ద్వారా తెలిపింది మమతా మోహన్ దాస్. దాని పేరు ‘విటిలిగో’. మన వాడుక భాషలో ‘బొల్లి వ్యాధి’ అని కూడా అంటారు.
ఇదో రకమైన చర్మ వ్యాధి. ప్రాణాంతకం కాదు. ఎలాంటి ప్రమాదమూ లేదు. కానీ, చర్మంపై అక్కడక్కడా తెల్లని మచ్చలు ఇబ్బంది పెడుతుంటాయ్.
చర్మంలోని మెలనిన్ కణాలు మృతి చెందడం వల్ల ఈ సమస్య ఏర్పుడుతుంది.
చర్మానికి ఏదైనా హాని జరగడం వల్ల కానీ, ఏదైనా హానికాకరకమైన రసాయనాల ప్రభావం చర్మంపై పడడం వల్ల కానీ, ఈ తరహా వ్యాధి వస్తుందని సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రాణాంతక వ్యాధితో రెండు సార్లు పోరాడి గెలిచిన మమతా మోహన్ దాస్‌కి ఈ చర్మ వ్యాధిని ఎదుర్కోవడం ఏమంత కష్టం కాదనే చెప్పొచ్చు. కానీ, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదని కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.
Also Read: కాలేజీ కుర్రాడు.! పబ్లిక్‌లో హీరోయిన్‌ని ‘నొక్కి’ పడేశాడు.!
ఇదిలా వుంటే, మమతా మోహన్ దాస్ ఈసారి చేసిన పబ్లిసిటీ స్టంట్ బూమరాంగ్ అయ్యిందనీ, రోగాల్ని కూడా పబ్లిసిటీకి వాడుకోవడమేంటనీ నెటిజన్లు మండిపడుతున్నారు.
మొన్న సమంత.. ఇప్పుడేమో మమత.. రోగాల గురించి కూడా పబ్లిసిటీ చేసుకుంటారా.? సింపతీ యాపారం ఎంతవరకు సబబు.? అన్నదే చాలామంది డౌటానుమానం.