Manchu Manoj Vishnu.. మంచు మనోజ్ తగ్గేదే లే.. అంటున్నాడు.! అన్న మంచు విష్ణు మీద పోరాటం విషయంలోనా.? అసలు, అన్నయ్య మంచు విష్ణుతో తమ్ముడు మంచు మనోజ్‌కి గొడవేంటి.?
సారధి అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్ళి మంచు విష్ణు యాగీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ, ‘మా వాళ్ళపై.. మా బంధువులపై ఇలాగే దాడులు చేస్తారు.. ఇదీ సిట్యుయేషన్’ అంటూ పేర్కొన్నాడు మనోజ్.
‘చిన్న విషయమే..’ అంటూ మనోజ్ తల్లితోపాటు మనోజ్ తండ్రి మోహన్‌బాబు కూడా స్పందించారు. విష్ణు కూడా ఇదే మాట అన్నాడు.
Manchu Manoj Vishnu చావు వరకూ ఎందుకు వెళ్ళింది.?
‘కళ్ళ ముందు జరిగే తప్పులు చూసి కూడా స్పందించకుండా బతికే కన్నా, పోరాడుతూ చావడానికైనా సిద్ధం..’ అంటూ ట్వీటేశాడు మంచు మనోజ్ తాజాగా.
సూజీ కాన్సెమ్ కొటేషన్‌నే పోస్ట్ చేసినా, అందులో విషయం చాలా తీవ్రమైనది. అంతటి తీవ్రతతో కూడిన కొటేషన్ పోస్ట్ చేసేంతలా మనోజ్ ఎందుకు బాధపడినట్లు.?
చావు ప్రస్తావనదాకా మంచు మనోజ్ ఎందుకు వెళ్లాడు.?
న్యాయపోరాటం చేస్తాడా.? విష్ణు, మనోజ్‌లలో తప్పెవరిది.?
మోహన్‌బాబు ఆస్తుల పంపకాల్లో తేడా కొంప ముంచేస్తోందా.?
Mudra369
పైగా, పోస్ట్‌లో పిడికిలి బిగించినట్టుంది.! సో, అన్న మంచు విష్ణు మీద తమ్ముడు మంచు విష్ణు యుద్ధాన్ని ప్రకటించినట్లే వుంది.
ఆస్తుల పంపకాల్లో తేడాలా.?
కాగా, మోహన్‌బాబు కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన సినీ ప్రముఖుడు త్రిపురనేని చిట్టి మాట్లాడుతూ, ‘అందరికీ ఆస్తుల్ని మోహన్‌బాబు పంచేశారు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
‘విష్ణు ముక్కు సూటి మనిషి. లెక్కల్లో తేడాలు రావడంతో వాటిని ఇన్నాళ్ళుగా చూసుకుంటున్న సారధిని నిలదీశారు. ఆ సారధి మనోజ్‌కి అత్యంత సన్నిహితుడిగా వుంటున్నాడిప్పుడు..’ అని త్రిపురనేని చిట్టి చెప్పుకొచ్చారు.
Also Read: Ramcharan Orange Movie: ఫ్లాప్ సినిమాకి ఎందుకింత క్రేజ్.?
సో, వ్యవహారం ఆస్తుల పంపకాలకు సంబంధించిందేనా.? అన్న చర్చ తెరపైకొచ్చింది. ఇంతకీ, మనోజ్ తదుపరి స్టెప్ ఏంటి.?
‘నువ్వు తగ్గొద్దు.. నీ వెనకాల మేమున్నాం.. న్యాయపోరాటం చేసి, నీ హక్కుల్ని సాధించుకో..’ అంటూ మనోజ్‌కి అతని అభిమానులు సూచిస్తున్నారు.