Table of Contents
Manchu Vishnu Kannappa Review.. మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కన్నప్ప’ కొద్ది రోజుల క్రితం విడుదలైంది. ‘సమీక్ష’ల విషయంలో సినీ ఎర్నలిస్టులు భయపడ్డారు.
చాలా మీడియా సంస్థలు రివ్యూలు ఇవ్వడనికి ఒకటికి పదిసార్లు ఆలోచించుకున్నాయి. ఆ స్థాయిలో మంచు విష్ణు భయపెట్టాడన్న చర్చ సినీ వర్గాల్లో జరిగినమాట వాస్తవం.
తీరిక దొరక్క, ‘కన్నప్ప’ సినిమా చూడటం ఆలస్యమయ్యింది. సర్లే, ఓటీటీలో వచ్చాక చూద్దాంలే.. అనుకున్నా, సాహసించలేకపోయాను.
కారణం, అందరికీ తెలిసిందే.! సినిమా ప్రమోషన్ల కోసం వాడిన కంటెంట్, సినిమాపై ఏమాత్రం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోయింది.
Manchu Vishnu Kannappa Review.. బోల్డంతమంది నటీనటులు..
అక్షయ్ కుమార్, ప్రభాస్, మోహన్ లాల్.. ఇలా ప్రముఖ తారాగణనాన్ని వివిద సినీ పరిశ్రమల నుంచి తీసుకొచ్చాడు మంచు విష్ణు. ఒకప్పటి హీరోయిన్ మధుబాల కూడా ఈ సినిమాలో వుంది.
హీరోయిన్‌గా ప్రీతి ముకుందన్‌ని టాలీవుడ్కి తీసుకొచ్చాడు మంచు విష్ణు, ‘కన్నప్ప’ కోసం.! అన్నట్టు, కాజల్ అగర్వాల్ పార్వతీ దేవిగా కనిపించింది ఈ ‘కన్నప్ప’ సినిమాలో.

మోహన్‌బాబు, విష్ణు, విష్ణు కుమారుడు, విష్ణు కుమార్తెలు.. ఈ సినిమాలో వున్నారు. మోహన్‌బాబు ఓ కీలక పాత్రలో కనిపించారు. శరత్ కుమార్, తిన్నడి తండ్రి పాత్రలో నటించారు.
వాయు లింగం, దైవాన్ని అస్సలు ఇష్టపడని తిన్నడు.. ఇవీ ఈ సినిమాలో కీలకమైన ఎలిమెంట్స్. తిన్నడే, ఎలా కన్నప్పగా మారాడన్నది అసలు కథ.
తెరపైకి వచ్చి మాయమవుతుంటాయ్..
మగధీర సహా, చాలా సినిమాలు గుర్తుకొస్తాయ్.. సినిమా చూస్తుంటే. ఏ పాత్ర ఎందుకు తెరపైకి వస్తుందో అర్థం కాని పరిస్థితి. ఒక్కో పాత్రా.. వచ్చి పోతుంటుంది.
మంచు విష్ణు, సినిమా కోసం రకరకాల విన్యాసాలు చేసేశాడు. హీరోయిన్‌తో చేసిన విన్యాసాలైతే మరీ అసభ్యకరంగా వున్నాయ్.! అవన్నీ పక్కన పెడితే, ప్రభాస్ ఎంట్రీ తర్వాత పరిస్థితి మారింది.

‘రుద్ర’ పాత్రలో ప్రభాస్ తెరపై మెరిశాడు. సినిమా గురించి ఏదన్నా చెప్పుకోవాల్సి వుందీ.. అంటే, ఇదొక్కటే. మిగతా సినిమా అంతా, జస్ట్ ట్రాష్.. అనడం అతిశయోక్తి కాదు.
హాలీవుడ్ సాంకేతిక నిపుణుల్ని తీసుకొచ్చాడు విష్ణు. ఇంతోటి సినిమాకి, అంత హంగామా అవసరమా.? అనిపిస్తుంది సినిమా చూసిన ఎవరికైనా.
సాగతీత.. తాపత్రయం.. కక్కుర్తి..
ఓటీటీలోనే, ఈ సినిమా చూసేందుకు రోజుల సమయం పట్టిందంటే.. ఆ సాగదీత ఎంతగా ఇబ్బంది పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. పది పాతిక సార్లు స్కిప్ చేసుకుంటూ వెళ్ళి, సినిమా పూర్తి చేయాల్సి వచ్చింది.
బడ్జెట్ పెట్టాడు విష్ణు.. కథ కోసం రీసెర్చ్ కూడా చేశాడు. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల్ని తీసుకొచ్చాడు.. వివిధ సినీ పరిశ్రమల నుంచి స్టార్లనూ తీసుకొచ్చాడు.
పవిత్ర వాయు లింగం వైపు ఎవరూ రాకుండా రక్షణగా ఏనుగు, భారీ సర్పం, సాలీడు.. వుంటాయా.? అంటే, అదీ లేదు.
నిర్జన ప్రదేశంలో వాయు లింగం వుంటుంది.. ఎవరూ అటు వైపు వెళ్ళకూడదని మోహన్‌బాబు పాత్ర జస్ట్ చెబుతుందంతే. దానికి కాపలాగా ఓ తెగ వుంటుందని చెప్పడమే తప్ప, అదీ సరిగ్గా డిజైన్ చేయలేదు.
ఐదుగురు ‘తెగ’ నాయకులు తమ తమ ప్రాంతాల్ని పరిపాలించేస్తుంటారు. వాటిల్లో అసలు జనమే కనిపించరు. లక్ష మంది సైన్యంతో శతృవు వస్తున్నాడంటే.. ఎదుర్కొనేందుకు వీళ్ళెంతమంది వుండాలి.?
ఇలాంటి చాలా లూప్ హోల్స్, ‘కన్నప్ప’ సినిమాని నవ్వులపాలు చేసిందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఏం లాభం.? తన పైత్యంతో.. సినిమాకి తానే పాతరేసేశాడు.! తన పిల్లల్ని ఈ సినిమాతో పరిచయం చేయాలన్న తాపత్రయం, హీరోయిన్‌తో రొమాంటిక్ ట్రాక్.. అనే కక్కుర్తి.. ఇవే ‘కన్నప్ప’కి శాపంగా మారాయి.
ఓ గంట సినిమాగా, ‘కన్నప్ప’ని ట్రిమ్ చేసి వుంటే, బెటర్ రిజల్ట్ వుండేదేమో.!
– yeSBee