Mark Antony Review.. ఎవరు హీరో.? ఎవరు విలన్.? అప్పట్లో హీరో, ఇప్పుడు విలన్.! అప్పట్లో విలన్, ఇప్పుడేమో హీరో.! అప్పుడంటే ఎప్పుడు.? ఇప్పుడంటే ఎప్పుడు.?
అంతా గందరగోళం.! తెరపై పాత్రలు ఏవేవో చేస్తుంటాయ్.! ఎందుకు చేస్తుంటాయో ఎవరికీ అర్థం కాదు.
ఇదేదో ఇంటెల్లిజెంట్ మూవీ అనుకునేరు.! ఇంత గట్టి బుర్ర వున్నా, సినిమాని అర్థం చేసుకోవడం అంత తేలిక కాదు.!
Mark Antony Review.. కథేంటంటే..
అసలు కథేంటో తెలియాలంటే, సినిమాని ఓ ఐదారుసార్లు చూడాలేమో.! టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ఇది. అంటే, ఓ కాలంలో వుండి, ఇంకో కాలంలోకి తొంగి చూడటం.!
అక్కడ మార్పులు.. వాటి పర్యవసానం ఇప్పడు.! చెప్పడానికే ఇంత గందరగోళంగా వుందంటే, సినిమా చూస్తే ఏమైపోతారో ఏమో.!
గ్యాంగ్‌స్టర్ ఆంటోనీ (విశాల్) చనిపోతాడు. అతని కొడుకు మార్క్ (విశాల్)ని చేరదీస్తాడు జాకీ మార్తాండ (ఎస్‌జే సూర్య).
తండ్రి ఆంటోనీ అంటే అస్సలు ఇష్టం వుండదు మార్క్‌కి. తన జీవితంలో ప్రతిసారీ ఆంటోనీ అన్న గుర్తింపు మార్క్‌ని ఇబ్బంది పెడుతుంది.
కానీ, ఓ నిజం.. తన తండ్రి విషయంలో మార్క్ ఆలోచనల్ని మార్చేస్తుంది. అదేంటి.? అది తెరపై చూడాల్సిందే.
హీరోయిన్ రీతూ వర్మ సినిమాలో వుందంటే, వుందంతే. ఆమె చెయ్యడానికేమీ లేదు. ఎస్‌జే సూర్య బాగానే చేశాడు. విశాల్ బాగా చెయ్యడానికి ప్రయత్నించినట్లుగా కనిపించి విఫలమయ్యాడు.
భిన్నమైన గెటప్పులు.. వాటికి కనెక్ట్ అవడమే అసలు సమస్య. తమిళ సినిమాని తెలుగులో చూసినా, సినిమా అర్థమవుతుంది.
తెలుగు డబ్బింగ్ చూస్తున్నాగానీ, సినిమా అర్థం కాదాయె.!
పాతకాలం నాటి యాంబియన్స్ క్రియేట్ చేయడానికి కష్టపడ్డారు. సినిమాలోని తన పాత్రల్లో ఒదిగిపోవడానికి విశాల్ చేసిన ప్రయత్నాన్ని అభినందించొచ్చు. కానీ, ఆ ప్రయత్నమైతే సఫలం కాలేదు.
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అనాలా.? అంతేనేమో.! బాలేదని కూడా అనొచ్చు. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ లోపాలు ఇలాంటి సినిమాలకు వుండకూడదు. ఇందులో ఎక్కువే వున్నాయ్.
Also Read: జూ.ఎన్టీయార్‌కి ‘చంద్ర’గ్రహణం.! బాలయ్య కనుసన్నల్లో.?
బడ్జెట్ గట్టిగానే పెట్టారు. తెరపై ఆ ఖర్చు తాలూకు వాతావరణం కనిపిస్తుంది. మాస్ ఆడియన్స్‌ని మెప్పించలేక, క్లాస్ ఆడియన్స్‌కీ అర్థం కాక.. ఇదో వృధా ప్రయోగమై కూర్చుంది.
ఈ మధ్య విశాల్ సినిమాలు వస్తున్నాయ్.. వెళుతున్నాయ్.! పబ్లిసిటీ మీద పెడుతున్న శ్రద్ధ సినిమా తీయడంలో పెట్టలేకపోతున్నారేంటో విశాల్ సినిమాల విషయంలో.