Mark Shankar Health Update.. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్, సింగపూర్‌లోని ఓ స్కూల్లో అగ్ని ప్రమాదం బారిన పడిన సంగతి తెలిసిందే.
అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్ చేతికి, కాళ్ళకి గాయాలయ్యాయి. పొగ ఎక్కువగా పీల్చడంతో, తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు మార్క్ శంకర్.
ఈ ఘటనలో ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరోపక్క, జరిగిన ప్రమాద ఘటనపై విచారణ కూడా ప్రారంభమయ్యింది.
కాగా, కుమారుడిని చూసేందుకు సింగపూర్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్. సింగపూర్ విమానాశ్రయం నుంచి నేరుగా, కుమారుడికి వైద్య చికిత్స అందిస్తున్న ఆసుపత్రికి పవన్ కళ్యాణ్ వెళ్ళారు.
Mark Shankar Health Update.. కోలుకుంటున్న మార్క్ శంకర్..
ఆసుపత్రిలో డాక్టర్లను అడిగి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని గురించి తెలుసుకున్నారు ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్.
ప్రాణాపాయం ఏమీ లేదని, అయితే మార్క్ శంకర్ పొగ ఎక్కువగా ఊపిరి తిత్తుల్లో చేరిన దరిమిలా, కొన్ని వైద్య పరీక్షలు అవసరమని వైద్యులు సూచించారు.
వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.. రెండు మూడు రోజులపాటు ఆసుపత్రిలోనే మార్క్ శంకర్ వుండాల్సి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
మరోపక్క, మార్క్ శంకర్ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముక్కుకి మాస్క్ ద్వారా ఆక్సిజన్ అందిస్తున్నారు. అదే సమయంలో, ఓ చేతికి బ్యాండేజ్ వేసి వుంది.
పవన్ కళ్యాణ్ వెంట చిరంజీవి, సురేఖ.. సింగపూర్ వెళ్ళి, ఆసుపత్రిలో మార్క్ శంకర్‌ని పరామర్శించారు.