Mass Jathara Dubai Vamsi.. చిన్న వయసులోనే బోల్డంత స్టార్‌డమ్ సంపాదించేసుకున్నాడు నాగవంశీ, నిర్మాతగా.!
తెలుగు సినీ పరిశ్రమలో భారీ స్టార్ కాస్టింగ్ సెట్ చేస్తున్నాడు ఈ యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్.!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని. జూనియర్ ఎన్టీయార్‌ని ‘అన్నా’ అని ఆప్యాయంగా పిలుస్తాడు.! నిజానికి, అరుదైన వ్యక్తిత్వమే.!
2024 ఎన్నికల్లో జన సేన పార్టీ కోసం గ్రౌండ్‌లో వర్క్ చేశాడు నాగ వంశీ. అలా, పవన్ కళ్యాణ్ అభిమానుల్లో నాగ వంశీ అంటే, ప్రత్యేకమైన గౌరవం కూడా వుంది.
అదే సమయంలో, ‘నోటి తీట’ నాగ వంశీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ‘దుబాయ్ వంశీ’ అనీ, ‘చింప్టూ’ అనీ, నాగ వంశీ మీద సెటైర్లు పడుతుంటాయి సోషల్ మీడియా వేదికగా.
Mass Jathara Dubai Vamsi.. అప్పట్లో ‘వార్-2’ కోసం నాగ వంశీ అలా..
బాలీవుడ్‌కి ఎన్టీయార్ వెళ్ళడం కాదు, హృతిక్ రోషన్‌ని టాలీవుడ్‌కి పరిచయం చేస్తున్నాం.. అంటూ, ‘వార్-2’ సినిమా టైమ్‌లో నాగ వంశీ చేసిన ‘అతి’ అంతా ఇంతా కాదు.!
అదే, నాగ వంశీ కొంప ముంచేసింది. ‘వార్-2’ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేయడంతో, ‘దుబాయ్ పారిపోయాడు’ అనే విమర్శలు వచ్చాయి.
చిత్రంగా, కొన్నాళ్ళపాటు ‘వార్-2’ గురించి ఎక్కడా మాట్లాడలేదు.. అసలు, నాగ వంశీ జాడే లేదు.! ‘వార్-2’ కొట్టిన దెబ్బ అలాంటిది.
‘మేం బలంగా నమ్మాం.. కానీ, దెబ్బ తిన్నాం..’ అంటూ, నాగవంశీ ‘వార్-2’ విషయమై ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం చూశాం.!
సినిమా అంటేనే, డిఫరెంట్ బాల్ గేమ్.. ఓ సినిమా ఎందుకు సక్సెస్ అవుతుందో చెప్పలేం, ఓ సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుందో చెప్పలేం.!
కంటెంట్ బావున్నా ఆడని సినిమాలు, కంటెంట్ లేకపోయినా ఆడే సినిమాలూ.. ఈ రెండూ వుంటాయి.. అదే, సినీ మాయ.! ఆ సంగతి నాగ వంశీకి కూడా బాగా తెలుసు.
మీడియా మేనేజ్‌మెంట్ బాగా తెలుసు..
మీడియాని మ్యానేజ్ చేయగలడు.. అదే మీడియా మీద సెటైర్లు వేసి, మీడియా నుంచి విమర్శలూ ఎదుర్కోగలడు. నాగ వంశీ రూటే సెపరేటు.!
ఇప్పుడిక ‘మాస్ జాతర’ ప్రమోషన్లలో బిజీగా వున్నాడు నాగ వంశీ. ఈ క్రమంలో ‘దుబాయ్ వంశీ’ సెటైర్ల మీద, ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో స్పందించాడు.
‘ఈసారి ఏం జరిగినా దుబాయ్ అయితే వెళ్ళిపోను..’ అంటూ, నాగ వంశీ, ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వ్యాఖ్యానించడం గమనార్హం.
Also Read: గ్లామ్ షాట్.! శ్రద్ధగా.. స్టైలిష్‌గా.!
అంటే, ‘వార్-2’ సినిమా విషయమై, దుబాయ్‌కి నాగ వంశీ పారిపోయింది నిజమేనా.? అంటూ, మళ్ళీ కొత్త రచ్చ మొదలైంది.
జూనియర్ ఎన్టీయార్ ఫ్యాన్స్, నాగ వంశీ మీద గుస్సా అవుతున్నారిప్పడు. ఇది నిరంతర ప్రక్రియ.! ఏదైతేనేం, నాగ వంశీ పేరు వార్తల్లో మార్మోగిపోతోంది.!
అలా తన పేరు మీడియాలో మార్మోగిపోవాలనే బహుశా, నాగ వంశీ ఇలాంటి సెటైర్లు వేస్తుంటాడు. అంతేనా.? అంతేనేమో.!
