Mass Jathara FDFS Raviteja.. ‘మాస్ జాతర’ సినిమా రిజల్ట్ నిర్మాత నాగ వంశీకి, హీరో రవితేజకీ ముందే తెలిసిపోయిందా.? అంటే, ఔననే అనుకోవాలేమో.!
లేకపోతే, ‘ఓజీ’ సినిమాతోనూ, ‘అతనొక్కడే’ సినిమాతోనూ ‘మాస్ మహరాజ్’ సినిమాని ఎందుకు పోల్చుతారు.? మాస్ సినిమా అంటే, ఇంతేనని ఎలా చెప్తారు.?
ఏదన్నా మాస్ సినిమా వస్తే, పరమ రొటీన్.. అనే చర్చ జరగడం సహజమే. ఇందులో వింతేమీ వుండదు. అయినాగానీ, తమ సినిమాని ‘రొటీన్ రొట్ట’ అనే సంకేతాలివ్వకూడదు.
Mass Jathara FDFS Raviteja.. ప్రమోషన్లలో ఇదేం తీరు.?
సినిమాని సోషల్ మీడియా చంపేస్తుందంటూ, సినిమా ప్రమోషన్లలో ఓ డిస్కషన్ తీసుకొచ్చారు. ‘మాస్ జాతర’ సినిమాలోనూ, సోషల్ మీడియాపై సెటైర్లేశారు.
నిజానికి, సినిమాల్ని ప్రమోట్ చేసుకోవడానికీ సోషల్ మీడియానే కదా వాడుతున్నది.? నెగెటివ్ పబ్లిసిటీ ఒక్కోసారి సినిమాలకి వర్కవుట్ అవుతోంది.
అందుకే, నెగెటివ్ క్యాంపెయిన్ కోణంలోనూ, ‘మాస్ జాతర’ టీమ్ అదో టైపు పబ్లిసిటీకి తెరలేపిందన్న ప్రచారం జరిగింది.
రివ్యూలు.. దెబ్బ కొట్టేశాయ్..
నిన్న ‘మాస్ జాతర’కి ప్రీమియర్స్ వేశారు. ప్రీమియర్స్ అయిన వెంటనే రివ్యూలువ చ్చేశాయి. ఒకటిన్నర రెండు, రెండున్నర.. ఇవీ రేటింగులు.
ఎక్కడా రెండున్నర దాటిన దాఖలాల్లేవు రేటింగులు.. అలా వచ్చాయ్ రివ్యూలు.! సినిమాలో సీన్ టు సీన్.. అన్నీ సోషల్ మీడియాకి ముందే ఎక్కేశాయ్.!
Also Read: విశాఖపైనా, గూగుల్‌పైనా విషం చిమ్ముతున్న వైసీపీ.!
‘ఓజీ’ సినిమాలో హీరో, విలన్ తల నరకడం.. ‘అతనొక్కడే’ సినిమాలో హీరో, విలన్ తల నరకడం.. ‘సూర్యాపేట జంక్షన్’ అనే సినిమాలో హీరో, విలన్ తల నరకడం..
ఇవన్నీ చూడటానికి ఒకేలా వుండొచ్చు. కానీ, ఎమోషన్ క్యారీ అయిన విధానం ఒకటుంటుంది. సో, పోలిక పోల్చేటప్పుడు.. ఎందుకు పోలుస్తున్నామో తెలుసుకోకపోతే ఎలా.?
సినిమాకి పాజిటివ్ ప్రచారం హెల్పవుతుంది.. ఏడుపుగొట్టు ప్రచారం, సినిమాని దెబ్బ తీస్తుంది. కంటెంట్ లేనప్పుడే, ఏడుపుగొట్టు ప్రచారాన్ని ఆశ్రయిస్తారు.
‘మాస్ జాతర’ ప్రమోషన్స్ విషయంలో అదే జరిగిందని నిరూపితమయ్యింది.
రొటీన్ రొట్ట కొట్టుడు సినిమా.. అనే ‘లీడ్’ నిర్మాత వైపు నుంచీ, హీరో వైపు నుంచీ ముందే వచ్చేసింది ‘మాస్’ జాతరకి. అదే ‘మాస్ జాతర’ కొంప ముంచేసినట్టుంది.
‘మాస్ జాతర’ సినిమా సమీక్ష.. కాస్త తీరిగ్గా చెప్పుకుందాం. తొందరేం లేదు.!
