Mass Ka Das Viswak Sen.. సినిమా కోసం పబ్లిసిటీ స్టంట్లు చేయడం సినిమా వాళ్ళకి కొత్తేమీ కాదు. నిజానికి, తమ సినిమా కోసం పబ్లిసిటీ స్టంట్లు చేయడం ఆ సినిమా నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్ల బాధ్యత కూడా.!
ఓ చిన్న ప్రాంక్.. ఓ న్యూస్ ఛానల్ అతి.. వెరసి, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ టాక్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ అయ్యేలా చేసింది. ‘గెట్ ఔట్ ఫ్రమ్ మై షో..’ అంటూ ఓ న్యూస్ ఛానల్ యాంకర్ చేసిన ఓవరాక్షన్, విశ్వక్ సేన్‌కి అనూహ్యమైన ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది.
ఈ క్రమంలో విశ్వక్ సేన్ ‘ఫ..’ అంటూ వాడకూడని పదాన్ని అలవోకగా వాడేశాడు. దానికి ఆయన క్షమాపణ చెప్పినా, ఎట్టి పరిస్థితుల్లోనూ విశ్వక్ సేన్‌ని వదిలేది లేదంటోంది సదరు ఛానల్.
Mass Ka Das Viswak Sen.. ఆయన్నేమీ పీకలేరట.!
ఈ వివాదం ఎక్కడిదాకా వెళుతుంది.? అంటే, విశ్వక్ సేన్ తాజా సినిమా ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ విడుదలయ్యేదాకా. ఆ తర్వాత అంతా సైలెంటయిపోతుందేమో.!
విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన ‘అశోక వనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో రుక్షార్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటించింది. సినిమా సంగతి పక్కన పెడితే, ‘ఫ..’ వివాదాన్ని రాద్ధాంతం చేస్తోన్న న్యూస్ ఛానల్‌కి విశ్వక్ సేన్ తాజాగా మరో స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
‘నన్ను మీరు ఏమీ పీకలేరు..’ అంటూ తేల్చి చెప్పాడు విశ్వక్ సేన్.. సదరు ఛానల్‌కి. ‘నాకూ తల్లి వుంది.. నాకూ సోదరి వుంది.. ఎక్కడ ఏం మాట్లాడాలో నాకు తెలుసు. నా వ్యక్తిగత జీవితం మీద మీకు నచ్చిన కామెంట్లు వేసేసి, నా కుటుంబం బాధపడేలా చేయాలనుకున్నారు..’ అంటూ ఆ ఛానల్ మీద మండిపడ్డాడు విశ్వక్ సేన్.
Also Read: Kangana Ranaut.. వామ్మో.! ఏం తెలివి.? క్లీన్ బౌల్డ్ చేసేస్తోందే.?
ఇదిలా వుంటే, ఏ ప్రాంక్ గురించి విశ్వక్ సేన్ మీద ఆ ఛానల్ బురద చల్లడం మొదలు పెట్టిందో, అలాంటి ప్రాంక్ వ్యవహారాల్ని సదరు ఛానల్ దాదాపుగా నిత్యం ‘కామెడీ షో’ పేరుతో కొనసాగిస్తూనే వుండడం. అవన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయ్.
సో, విశ్వక్ సేన్ ‘నన్ను ఏమీ పీకలేరు’ అన్న మాటల్లో వాస్తవం వుందన్నమాట.
