Meenakshi Chaudhary Marriage.. ఇప్పుడిప్పుడే కెరీర్‌లో దూసుకెళుతోంది మీనాక్షి చౌదరి. ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి.
‘గుంటూరు కారం’ తదితర తెలుగు సినిమాల్లో నటించిన మీనాక్షి, తమిళ సినీ పరిశ్రమలోనూ అవకాశాలు దక్కించుకుంటోంది.
ఈ మధ్యనే ‘లక్కీ భాస్కర్’ సినిమాతో మంచి విజయాన్ని కూడా అందుకుంది మీనాక్షి చౌదరి. ఇంతలోనే, ఆమె మీద పుకార్లు షురూ అయ్యాయ్.
Meenakshi Chaudhary Marriage.. తొలి సినిమా హీరోతో పెళ్ళా.?
మీనాక్షికి తెలుగులో తొలి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. సుశాంత్ హీరోగా నటించాడు ఈ సినిమాలో. ఆ సుశాంత్‌తోనే మీనాక్షి పెళ్ళంటూ పుకార్లు జోరందుకున్నాయ్.
అయితే, ఇవన్నీ ఉత్త పుకార్లేనని తేలిపోయింది. ప్రస్తుతం ప్రేమ, పెళ్ళి లాంటి ఆలోచనలు ఏమీ చేయడంలేదని మీనాక్షి సన్నిహితులు చెబుతున్నారు.
Also Read: ఓయ్ ఎర్నలిస్టూ.! నువ్వూ కమిట్మెంట్ ఇచ్చావా.?
ఈ మధ్య ఏ హీరోయిన్ కనిపించినా, ‘పెళ్ళెప్పుడు.?’ అన్న ప్రశ్న సోకాల్డ్ ఎర్నలిస్టుల నుంచి పిచ్చి పిచ్చిగా వచ్చేస్తోంది.. అదీ సమయం, సందర్భం లేకుండా.

ఇంకో టైపు ఎర్నలిస్టులైతే, ఈ పుకార్ల మీదనే బతికేస్తున్నారు. వీళ్ళే పుకారు పుట్టించేసి, వీళ్ళే గాలి రాతలు రాసేసి, రోత పుట్టించేసి, ‘అబ్బే, అదేం లేదు..’ అని వీళ్ళే ఖండించేస్తుంటారు.
పెళ్ళి చేసుకోవాలనుకుంటే, ఈ రోజుల్లో రహస్య వ్యవహారాలేమీ కాదు కదా.! ఊరంత పందిరేసి మరీ, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు సెలబ్రిటీలు.
ఇదంతా తెలిసీ పుకార్లు పుట్టించడం ఏదైతే వుందో.! అదో దిక్కుమాలిన కళ.. అంతే.!